Friday, September 26, 2025
E-PAPER
Homeమానవిమహిళల‌ను ప్రోత్సహిస్తే ఏదైనా సాధిస్తారు...

మహిళల‌ను ప్రోత్సహిస్తే ఏదైనా సాధిస్తారు…

- Advertisement -

చిన్న వయసులోనే పెండ్లి చేసుకుంది. 19 ఏండ్లకే ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది. దాంతో కుటుంబ బాధ్యతలు పెరిగాయని ఇంటికే పరిమితం కాలేదు. మళ్లీ తన చదువును మొదలుపెట్టింది. ఓ తల్లిగా, భార్యగా అన్నీ చేస్తూనే పదవ తరగతితో ఆగిపోయిన చదువును తిరిగి కొనసాగించింది. ఎమ్మె, బీఎడ్‌ పూర్తి చేసింది. కొంత కాలం టీచర్‌గా ఉద్యోగం కూడా చేసింది. కొన్ని అనారోగ్య సమస్యలు ఆమెను ఆక్యు పంక్చర్‌ డాక్టర్‌ని చేశాయి. ప్రస్తుతం డాక్టర్‌గా అనేక సేవలు అందిస్తున్న అస్మాబేగం పరిచయం నేటి మానవిలో…

మీ కుటుంబ నేపధ్యం, విద్యాభ్యాసం గురించి చెబుతారా?
అమ్మానాన్నలు జమీల, యూసఫ్‌ అలీ. పుట్టింది హైదరాబాద్‌లో పెరిగింది విజయవాడలో. 10వ తరగతి అవ్వగానే పెండ్లి చేశారు. తర్వాత హైదరాబాద్‌కి వచ్చేసాను. పెండ్లయిన మూడేండ్లలో ఇద్దరు పిల్లలు పుట్టారు. నాకు 19 ఏండ్లు వచ్చిన తర్వాత మళ్ళీ చదువు ప్రారంభించాను. ఎమ్మె వరకు చదువుకున్నాను. బీఎడ్‌ కూడా చేసాను.

ఈ వృత్తిలోకి ఎలా వచ్చారు?
ముందు టీచర్‌గా కొంత కాలం చేశాను. స్కూల్లో చేసేటప్పుడు నాకే హెల్త్‌ ఇష్యూస్‌ చాలా వచ్చాయి. అప్పుడు ఆలోపతి మందులు వాడితే బాగా నిద్ర వచ్చేసేది. దాంతో స్కూల్లో టీచింగ్‌ చేయలేకపోయాను. నా అనారోగ్య సమస్య నుండి బయటకు రావాలంటే ఆక్యుపంక్చర్‌ వైద్యం చాలా బాగా పని చేస్తుందని తెలిసిన వాళ్లు సలహా ఇచ్చారు. వారి సలహా మేరకు ఆక్యుపంక్చర్‌ చేయించుకొని మూడు నెలల్లోనే కోలుకున్నాను. అప్పుడే నాకు ఈ వైద్యంపై ఆసక్తి కలిగింది. వెంటనే శిక్షణ తీసుకున్నాను.

ఎక్కడ నేర్చుకున్నారు?
మొదట ఆక్యుపంక్చర్‌ డా||లోహియ ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఆక్యుపంక్చర్‌ సైన్స్‌, ముంబయిలో నేర్చుకున్నాను. తర్వాత చెన్నైలో ఒక ఇనిస్టిట్యూట్లో మాస్టర్స్‌ చేశాను. డా|| లోహియ ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఆక్యుపంక్చర్‌ సైన్స్‌లో మొదటి స్టూడెంట్‌ నేనే అని చెప్పుకోడానికి చాలా గర్వపడతాను. డిప్లమా, డిగ్రీ తర్వాత మాస్టర్స్‌ చేసాను.

ఆక్యు ప్రెషర్‌కి, ఆక్యు పంక్చర్‌కి తేడా ఏంటి?
ఆక్యు ప్రెషర్‌ అంటే కేవలం మన శరీరం పైన ఉన్న పాయింట్స్‌ని ప్రెషర్‌ చేయడం. ఆక్యుపంక్చర్‌ అంటే మనకు దేహంలో ప్రాణనాడులు ఉంటాయి. వాటికి నీడీల్‌ పెట్టి సమస్యని క్లియర్‌ చేయటం. ఆక్యుప్రెషర్‌ అనేది తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇస్తుంది. ఆక్యుపంక్చర్‌ పర్మినెంట్‌ రిలీఫ్‌ ఇస్తుంది. ఇది రూట్‌ కాజ్‌ ట్రీట్మెంట్‌.

దీనిలో ఎన్ని రకాలు ఉంటాయి?
నేను చేసేది ఇండియన్‌ ఆక్యు పంక్చర్‌. పంచభూతాలను చూసి శరీరంలో నిడిల్‌ పెట్టి చాలా తక్కువ సమయంలో తక్కువ నీడిల్స్‌తో చేసే ట్రీట్మెంట్‌ ఇండియన్‌ ఆక్యు పంక్చర్‌. దీని మూలాలు మన భారతదేశంలోనే ఉన్నాయి. చైనా వాళ్ళు దీన్ని అడాప్ట్‌ చేసుకొని కొన్ని విధానాలను మార్చి వాళ్లూ చేయడం ప్రారంభించారు.

ఈ వైద్యం ద్వారా ఎటువంటి రోగాలకు పరిష్కారం చూపించవచ్చు?
పుట్టిన శిశువు దగ్గర నుంచి 100 ఏండ్ల వృద్దుల వరకు ఏ వ్యాధికైనా ఇందులో చికిత్స ఉంది. కచ్చితంగా ట్రీట్మెంట్‌ అనేది ఉంది. కొంత మంది పిల్లలు చాలా తక్కువ బరువుతో పుట్టి, ఏడుస్తూ ఉంటారు. పుట్టిన వారం రోజుల తర్వాత పిల్లలకు నీడిల్‌ పెట్టి ఏడుపాగి పోయేటట్టుగా చేస్తాను. వాళ్ళు అప్పుడు హెల్తీగా తయారవుతారు. అదేవిధంగా ఆడపిల్లల్లో అయితే 10 ఏండ్ల తర్వాత హార్మోనల్‌ ఇన్‌ బ్యాలెన్స్‌ ఉంటుంది. ఇప్పటి పరిస్థితుల రీత్యా పదేండ్లకే హార్మోనల్‌ ఇన్‌ బ్యాలెన్స్‌ స్టార్ట్‌ అయిపోతుంది. పిసిఒడి, పిసిఓఎస్‌ కి నేను ట్రీట్మెంట్‌ ఇవ్వగలుగుతాను. 20 ఏండ్లు దాటిన తర్వాత వాళ్లకు హార్మోనల్‌ చేంజెస్‌ చాలా ఎక్కువ ఉండి ముఖంపై వచ్చే అన్వాంటెడ్‌ హెయిర్‌ తొలగించడానికి కూడా నేను ట్రీట్మెంట్‌ ఇస్తాను. పీరియడ్స్‌ రెగ్యులర్‌ రావడానికి ట్రీట్మెంట్‌ చేస్తాను. అలాగే పిల్లలు లేని దంపతులకు కూడా ట్రీట్మెంట్‌ ఇస్తాను.

ఈ కేసెస్‌ అయితే ఇప్పటివరకు చాలా చేశాను. మీ వల్ల మాకు పిల్లలు పుట్టారని చెప్తుంటే నాకు చాలా సంతోషం కలుగుతుంది. నా వైద్యం వారి సంతోషానికి సహకరించినందుకు చాలా ఆనందపడుతున్నాను. అదే విధంగా 40 ఏండ్లు దాటిన తర్వాత మహిళల్లో వచ్చే ఫ్రీ మెనోపాజ్‌, పోస్టు మెనూపాజ్‌ ప్రాబ్లమ్స్‌ అన్నింటికీ కూడా ట్రీట్మెంట్‌ చేస్తున్నాను. అదేవిధంగా వృద్ధుల్లో వచ్చే కాళ్ళ నొప్పులు, కీళ్లనొప్పులు, బ్యాక్‌ పెయిన్‌, సయాటికా, షోల్డర్‌ పెయిన్స్‌ వీటన్నిటికీ కూడా నా దగ్గర ట్రీట్మెంట్‌ ఉంది. యాభై ఏండ్లు దాటిన తర్వాత మగవాళ్లలో వచ్చే ప్రోస్టేట్‌ ప్రాబ్లమ్స్‌కి ట్రీట్మెంట్‌ చేస్తున్నాను. దగ్గు, జలుబు, జ్వరం లాంటి చిన్న చిన్న వాటికి కూడాను ఇమ్యూనిటీ రైస్‌ చేస్తే అవి ఫ్రీక్వెంట్‌గా రాకుండా ఉంటాయి. అలాంటి వాటికి కూడా మా దగ్గర ట్రీట్మెంట్‌ తీసుకోవచ్చు.

పురస్కారాలు ఏమైనా అందుకున్నారా?
శ్రీ ఆకాంక్ష చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా మహిళ దినోత్సవం సందర్భంగా శ్రీ ధాత్రి పురస్కారం, వల్లూరి ఫౌండేషన్‌ వారి బెస్ట్‌ ఆక్యుపంక్చర్‌ హీలర్‌, కరోనా వారియర్‌ మినిస్టర్‌ ఉఃషశ్రీశీషస 2021, మాతృదేవోభవ లక్ష్మీదేవి అవార్డు, స్వామి వివేకానంద రాష్ట్రీయ సేవా పురస్కార్‌ అందుకున్నాను.

నేటి యువతకు మీరేం చెబుతారు?
పెండ్లితో జీవితం ఆగిపోదు. ముఖ్యంగా మహిళలు చాలా మంది పెండ్లి తర్వాత కుటుంబ బాధ్యతలతో తమ గురించి తాము పట్టించుకోరు. కానీ మనలో సాధించాలనే పట్టుదల ఉంటే కచ్చితంగా విజయం సాధించవచ్చు. అయితే దీనికి కుటుంబ సహకారం తప్పని సరి. మహిళలకు ప్రోత్సాహం ఉంటే తమ కలలను నిజం చేసుకోగలుగుతారు.

పాలపర్తి సంధ్యారాణి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -