Monday, October 13, 2025
E-PAPER
Homeమానవిగుడ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే…

గుడ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే…

- Advertisement -

సాధారణంగా గుడ్డును సంపూర్ణ ఆహారం అంటారు. రోజుకు ఒక్క గుడ్డైనా సరే తినాలంటారు. గుడ్డులో అధిక మోతాదులో పోషకాలు ఉంటాయి. ప్రోటీన్లు, విటమిన్లు, సెలెనియం, ఐరన్‌ వంటి ఖనిజాలు గుడ్డులో లభిస్తాయి. గుడ్లు తినడం వల్ల ఎముకలు బలంగా మారతాయి. గుండె ఆరోగ్యానికి మంచిది. చర్మ, జుట్టు సంరక్షణలో కీలకపాత్ర పోషిస్తుంది. ఎన్నో పోషక విలువలున్న గుడ్డును సరిగా నిల్వ చేసుకోకపోతే త్వరగా పాడైపోతాయి. అలా పాడవ్వకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం.

సాల్మెనెల్లా బ్యాక్టీరియా గుడ్ల షెల్‌, లోపల ఉంటుంది. ఈ బ్యాక్టీరియా పెరుగుదల గది ఉష్ణోగ్రత కంటే చల్లగా ఉన్నప్పుడు ఎక్కువగా ఉంటుంది. ఫ్రిజ్‌లో పెడితే బ్యాక్టీరియా గుడ్డుపైనే కాకుండా మిగతా పదార్థాలపై కూడా వ్యాపిస్తుంది.. అందుకే వీటిని ఫ్రిజ్‌లో పెట్టకూడదు. కోడి గుడ్డు ఎక్కువకాలం తాజాగా ఉండాలంటే వాటిని ఎక్కువగా కదపకూడదు. వెడల్పుగా ఉండే భాగాన్ని పైకి, వెడల్పు తక్కువ భాగాన్ని కిందికి వచ్చేలా ఉంచాలి. గుడ్ల పైన పెంకుపై కొద్దిగా నూనె రాసి పెడితే, 10 నుండి 12 రోజుల వరకూ తాజాగా ఉంటాయి. టిష్యూ పేపర్లలో చుట్టి నిల్వ చేసుకున్నా ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -