- Advertisement -
• సర్పంచ్ వీరమళ్ళ శిరీష లోకేష్ గౌడ్
నవతెలంగాణ-మర్రిగూడ
మతసామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు అని మర్రిగూడ గ్రామ సర్పంచ్ వీరమల్ల శిరీష లోకేష్ గౌడ్ అన్నారు.బుధవారం మండల కేంద్రంలోని ముస్లింలకు సర్పంచ్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు.రంజాన్ ముస్లిం సోదరులకు పవిత్ర మాసమన్నారు.రంజాన్ ఉపవాస దీక్షలు చేస్తున్నవారికి ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ మహేశ్వరం రమేష్,ముస్లిం మత పెద్దలు,వార్డ్ సభ్యులు యండి జమీర్,మాజీ కోఆప్షన్ సభ్యులు యాకుబ్ అలీ,యండి జబ్బార్ అశ్వక్ ,యూసుఫ్,సలీం,తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



