- Advertisement -
అక్రమ ఇసుక రవాణాపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం : ఆర్ఐ సాయిబాబా
నవతెలంగాణ – మద్నూర్: డోంగ్లి మండల పరిధిలోకి వచ్చే మంజీర నది నుండి అక్రమంగా ఇసుక తరలించే వాటి పట్ల రెవెన్యూ అధికారులు పకడ్బందీ నిఘ పెట్టారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో అక్రమ ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు, అధికారుల రాకతో ఇసుకను కాళీ చేసి పరారైయ్యారు. కానీ భారీ ఇసుక లోడుతో ఉన్న టిప్పర్ ను పట్టుకున్నట్లు ఆర్ఐ సాయిబాబా నవతెలంగాణతో తెలిపారు. ఈ టిప్పర్ను మద్నూర్ పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు ఆయన తెలిపారు. మంజీర నది నుంచి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్ఐ హెచ్చరించారు. ఈ అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.
- Advertisement -