Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుఅక్రమంగా తరలిపోతున్న ఇసుక..

అక్రమంగా తరలిపోతున్న ఇసుక..

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ : అక్రమ ఇసుక దారులకు మంజీరా నది అడ్డగా మారింది. ప్రస్తుతం రెవిన్యూ అధికారులు భూభారతి సదస్సుల్లో పాల్గొంటున్నారు. ఇదే ఆసరాగా చేసుకొని అక్రమ ఇసుకదారులు రాత్రి పగలు తేడా లేకుండా మంజీరా నది నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. ఒక్కొక్క ఇసుక ట్రాక్టర్ రూ.10 నుండి రూ.12 వేలు పలుకుతున్నట్లు వినికిడి. అంతేకాదు.. ట్రాక్టర్ సైడ్ లకు చెక్కలు పెట్టి రెండు ట్రాక్టర్ల ఇసుక అంటూ డబుల్ రేట్లకు అమ్ముకుంటున్నారు. మంజీరా నది నుంచి ఇసుక అక్రమంగా మహారాష్ట్రకు తరలిపోతున్నట్లు తెలిసింది. ఉదయం తెల్లవారుజామున పెద్దతడుగు రోడ్డు గుండా ఇసుక తరలించే ట్రాక్టర్లు నవ తెలంగాణ దృశ్యమాలికలో పడ్డాయి. అక్రమ ఇసుక తరలింపుపై సంబంధిత శాఖల అధికారులకు ఫోన్ ద్వారా సంప్రదించగా.. అట్లాంటి ఏమి లేవని, ఎక్కడ తరలిపోకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నా.. అక్రమ ఇసుక దందాకు అడ్డు లేకుండా పోతుంది. ఇకనైనా ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను మండల ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad