రేపు తెలంగాణ క్యాబినెట్‌ భేటీ..

నవతెలంగాణ – హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులు పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో రేపు తెలంగాణ క్యాబినెట్‌ భేటీ కానున్నది. ముఖ్యంగా నెల రోజుల కాంగ్రెస్‌ పరిపాలన, ఆరు గ్యారంటీల అమలుపై ఈ సమావేశంలో చర్చ జరుగనుంది. అదేవిధంగా పలు కీలక అంశాలు కూడా ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.

Spread the love