ఇస్లామాబాద్ : పాకిస్తాన్‌కు నిధులను విడుదల చేయడానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) కొత్తగా మరో 11 షరతులను విధించింది. అలాగే, భారత్‌తో ఉద్రిక్తతలు పాకిస్తాన్ ఆర్థిక, ఇతర సంస్కరణ లక్ష్యాలకు ముప్పు కలిగిస్తాయని హెచ్చరించింది. పాక్‌కు కొత్తగా విధించిన షరతుల్లో రూ.17.6 ట్రిలియన్ల బడ్జెట్‌కు పార్లమెంట్ ఆమోదం, విద్యుత్ బిల్లులపై సర్‌చార్జీల పెంపు, మూడేళ్లకు పైగా ఉపయోగించిన కార్ల దిగుమతుల పై ఆంక్షలు తొలగించడం.. వంటివి ఉన్నాయి. అలాగే, 2035 నాటికి స్పెషల్ టెక్నాలజీ జోన్లు, ఇతర పారిశ్రామిక పార్కులకు అన్ని ప్రోత్సాహకాల ను పూర్తిగా తొలగించడానికి ఈ ఏడాది చివరి నాటికి ఒక నివేదికను సిద్ధం చేయాలని కూడా పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్ షరతు విధించింది. ఇంధన రంగంలో నాలుగు కొత్త షరతులు విధించింది. ఈ కొత్త షరతులతో పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్ విధించిన మొత్తం షరతుల సంఖ్య 50కు చేరుకుంది. భారత్ ఎంతగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా పాకిస్తాన్‌కు ఒక బిలియన్ డాలర్ల నిధులు (దాదాపు రూ. 8,540 కోట్లు) ఇవ్వడానికి ఐఎంఎఫ్ ఆమోదించింది. ఎక్స్‌టెండెడ్ ఫండ్ ఫెసిలిడి (ఇఎఫ్‌ఎఫ్) కింద ఈ నిధులు మంజారు చేయడానికి అంగీకరించింది.
పాక్‌కు ఐఎంఎఫ్ కొత్తగా 11 షరతులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES