Thursday, April 2, 2026
E-PAPER
Homeఖమ్మంఆకట్టుకున్న విద్యార్థుల మాక్ పార్లమెంట్

ఆకట్టుకున్న విద్యార్థుల మాక్ పార్లమెంట్

- Advertisement -

– పీఎం శ్రీ ఎంపీయూపీఎస్ నారంవారిగూడెంలో నిర్వహణ
– హాజరైన ఎంఈఓ ప్రసాదరావు 
నవతెలంగాణ – అశ్వారావుపేట
: పీఎం శ్రీ ఎంపీయూపీఎస్ నారంవారిగూడెం పాఠశాలలో విద్యార్థులకు ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్పించే ఉద్దేశంతో శుక్రవారం మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి ప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు స్పీకర్, ముఖ్యమంత్రి, డిప్యూటీ స్పీకర్, ప్రతిపక్ష నాయకుడు, హోంమినిస్టర్, విద్యాశాఖ మంత్రి వంటి పాత్రలను పోషిస్తూ పార్లమెంట్ నిర్వహణను అద్భుతంగా ప్రదర్శించారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమం, చర్చలు నిర్వహిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. ముఖ్య అతిథి ప్రసాదరావు మాట్లాడుతూ విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, మాట్లాడే నైపుణ్యం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ మాక్ పార్లమెంట్ లో లోక్ సభ స్పీకర్ గా కే.స్వాతి(7 వ తరగతి) ప్రధానమంత్రి గా కే. రక్షణ(8 వ తరగతి),ఉప ప్రధాని(విద్యా ప్రణాళిక శాఖ) గా ఎం.శ్రీజ( 7 వ తరగతి) ఫ్లోర్ లీడర్ లు గా సీహెచ్. తేజస్విని ( 8 వ తరగతి),డి.ధనంజలి (5 వ తరగతి), ఉప సభాపతి గా కే.లేఖిని (7 వ తరగతి),హోం మినిస్టర్ గా ఏ.స్నేహ (5 వ తరగతి),విద్యాశాఖ మంత్రి గా టు.లావణ్య ( 8 వ తరగతి), ఎపీ లు గా ఎన్. వైష్ణవి, పీ. నాగలక్ష్మి, టి. సాయి చరిత, పీ.డింపుల్, సాయి పూజిత ,షర్మిల, రాహుల్ శ్రీనివాస్ లు ఎంపీలు గా వ్యవహరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -