ఎల్లారెడ్డి ఏ ఎం సి చైర్ పర్సన్ రజిత వెంకటరామిరెడ్డి…
నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
గత 15 ఏళ్లుగా జరగని అభివృద్ధి సంవత్సరం కాలంలోనే జరిగిందని ఎల్లారెడ్డి ఏఎంసీ చైర్పర్సన్ రజిత వెంకటరామిరెడ్డి అన్నారు. బుధవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీకి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు కృషితో 2,34 లక్షల నిధులు మంజూరు కావడం జరిగిందని ఆమె అన్నారు. శిధిలావస్థకు చేరిన మార్కెట్ కమిటీని నూతన భవనం నిర్మాణానికి, వే బ్రిడ్జ్ ఏర్పాటుకు 10 షెటర్ల నిర్మాణం కొరకు నిధులు మంజూరు కావడం చాలా సంతోషంగా ఉందన్నారు.
లింగంపేట్ నాగిరెడ్డిపేట్ మండలాలలో వే బ్రిడ్జి ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు ఏర్పాటు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. ఇప్పటివరకు ఎల్లారెడ్డిలో జరగని అభివృద్ధి మదన్మోహన్ నాయకత్వంలో జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. ఆమె వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్ సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి మండల అధ్యక్షులు ఇమామ్ ప్రధాన కార్యదర్శి దివిటీ కిష్టయ్య ఉన్నారు.
15 ఏండ్లుగా లేని అభివృద్ధి సంవత్సరంలోనే..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES