రోహిత్ హీరోగా అబిద్ భూషణ్ పోలీస్ పాత్రలో నటించిన సినిమా ‘మిస్టీరియస్’. రియా కపూర్, మేఘనా రాజ్ పుత్ నటీనటులుగా మహి కోమటిరెడ్డి దర్శకత్వంలో అశ్లీ క్రియేషన్స్ పై జయ్ వల్లందాస్ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 19న వరల్డ్‌వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత జయ్ వల్లందాస్ మీడియాతో ముచ్చటించారు. నేను యూఎస్‌లో ఉంటాను. సినిమా రంగం మీద ఆసక్తితో టాలీవుడ్‌కు వచ్చాను. నా స్నేహితుడు మహి కోమటిరెడ్డిని దర్శకుడిని చేయాలనే సంకల్పంతో ఈ చిత్రాన్ని నిర్మించాను. తొలి ప్రయత్నంలో ఒక కథా బలమున్న మంచి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను నిర్మించడం సంతృప్తిగా ఉంది.
మా సినిమాను ఈ నెల 12నే రిలీజ్ చేయాల్సి ఉంది. అయితే ‘అఖండ 2’ రిలీజ్ కారణంగా ఒక వారం ఆలస్యంగా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. 150 థియేటర్స్‌కు పైగా గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం. ఇన్నోవేటివ్ స్క్రీన్ ప్లే, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో సినిమా సాగుతూ ప్రేక్షకుడిని ఆద్యంతం ఒక కొత్త అనుభూతికిలోను చేస్తుంది. సెన్సార్ నుంచి కూడా మా మూవీకి అభినం దనలు దక్కాయి. ఒక డిఫరెంట్ సినిమా చేశారని వారు చెబుతూ..మా సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. మూవీలోని ప్రతి పాత్ర అనుమానాస్పదంగా అనిపిస్తుంది. చివరలో ఈ సస్పెన్స్ మిస్టరీని ఆకట్టుకునేలా ముగించాం. స్క్రీన్ నుంచి మీరు చూపు తిప్పుకోలేరు. అంతగా ప్రేక్షకులు మూవీకి కనెక్ట్ అవుతారని చెప్పగలను.
150 థియేటర్లకు పైగా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



