ఎండలు విపరీతంగా పెరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. వేడి వాతావరణం ముఖ్యంగా వద్ధులకు వారి శక్తి స్థాయిలు, జీర్ణక్రియ, రోగనిరోధక వ్యవస్థ, మొత్తం జీవశక్తిపై ప్రభావం చూపుతుంది. వేసవి కాలంలో వారి ఆరోగ్యం, శ్రేయస్సును కాపాడుకోవడానికి వారి జీవనశైలిని మార్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వేసవిలో వద్ధుల ఆహార భద్రత, శ్రేయస్సు కోసం చేయాల్సిన పనుల గురించి చూద్దాం..
పుష్కలంగా నీరు తాగాలి
వేడి వాతావరణం నిర్జలీకరణానికి కారణమవుతుంది. ఇది నీరసం, బద్ధకాన్ని పెంచుతుంది. వద్ధులు హీట్ స్ట్రోక్, ఇతర వేసవి అనారోగ్యాలను నివారించడానికి కొబ్బరి నీళ్లు, షర్బత్, మజ్జిగ, నిమ్మరసం వంటి ద్రవాలను పుష్కలంగా తాగాలి. తద్వారా తీవ్రమైన వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఆరోగ్యకరమైన ఆహారం
కాలానుగుణమైన పండ్లు, కూరగాయలు, గింజలు, అధిక నీటిశాతం ఉన్న ఆహారాలతో కూడిన తేలికైన, సమతుల్య భోజనం తినేలా వద్ధులను ప్రోత్సహించాలి. ఈ ఆహారాలు ఎలక్ట్రోలైట్‌లను తిరిగి నింపడంలో హైడ్రేషన్ స్థాయిల్లో సమతుల్యతకు
మండే ఎండల్లో…
- Advertisement -
- Advertisement -