Monday, March 23, 2026
E-PAPER
Homeజిల్లాలుజుక్కల్ ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలా?

జుక్కల్ ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలా?

- Advertisement -

– మాజీ ఎమ్మెల్యే షిండేపై కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దరాస్ సాయిలు

నవతెలంగాణ మద్నూర్

వెనుకబడ్డ జుక్కల్ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి పరుస్తూ జుక్కల్ ప్రజల్లో అభివృద్ధి ప్రదాతగా నిలిచే తోట లక్ష్మీ కాంతారావుపై రెండు రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే హనుమంతు షిండే చేసిన అనుచిత వ్యాఖ్యలను మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దరాస్ సాయిలు ఖండించారు. పలువురు మండల సర్పంచ్లతో కలిసి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంతు షిండే పై విరుచుకుపడ్డారు నీ మైండ్ మతిమరుపు అయింది. ఎర్రగడ్డ దవఖానలో చూపించుకో అంటూ లక్ష్మి కాంతారావుపై చేసిన ఆరోపణకు ఖండిస్తూ ఈ మాటలు మాట్లాడారు జుక్కల్కు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఏమీ చెయ్యలేనోనివి జుక్కల్ గా ఒకే ఒక్కసారి గెలిచి మొదటిసారి రెండున్నర సంవత్సరాల కాలంలో జుక్కల్ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తూ ఎంతో మెప్పు పొందుతున్న కాంతారావు పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే బాగుండదని హెచ్చరించారు.

నీవు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఏమీ చేయలేనివి తోట లక్ష్మి కాంతారావు చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఏదేదో మాట్లాడడం సరైనది కాదని అభివృద్ధిని చూసి మాట్లాడాలని మాజీ ఎమ్మెల్యేను హెచ్చరించారు. ఎమ్మెల్యేగా తోట చేసిన రెండున్నర సంవత్సరాల అభివృద్ధిలో నీవు చేసింది శూన్యమని అభివృద్ధి ప్రదాతకు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని మాట్లాడే హక్కు నీకు లేదని ఇలాంటి మాటలు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ ఊరుకోదని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో మద్నూర్ స్థానిక సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి, దేవాదాయ ధర్మాదాయ శాఖ సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయ కమిటీ చైర్మన్ రామ్ పటేల్ , హెచ్ కెలూరు సర్పంచ్ లక్ష్మణ్, చిన్న షక్కర్ సర్పంచ్ దిగంబర్, చిన్న తడగూర్ సర్పంచ్ సూర్య వంశీ ప్రకాష్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు బండి గోపి, వార్డ్ సభ్యులు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -