- Advertisement -
– జిల్లా సంక్షేమ శాఖ అధికారి నర్సింహారావు…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
దివ్యాంగులను సకలాంగులు వివాహం చేసుకుంటే లక్ష రూపాయలు ప్రోత్సకాన్ని ప్రభుత్వం అందిస్తుందని మహిళ, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల, శాఖ అధికారి నరసింహ రావు తెలిపారు. ప్రభుత్వం దివ్యాంగుల ఆర్థికాభివృద్ధి కోసం అందించే వివాహ ప్రోత్సాహక పథకాన్ని వినియోగించుకోవాలని కోరారు. దివ్యాంగులు సాధారణ వ్యక్తులను లేదా మరో దివ్యాంగుడిని వివాహం చేసుకుంటే ప్రభుత్వం రూ. 1,00,000/- ప్రోత్సాహకాన్ని ఇస్తుంది. అర్హులైన వారు వివాహమైన ఏడాదిలోపు (టీజీ ఈపాస్ ) వెబ్ సైట్ లో అప్లై చేయాలి, జిల్లా కలెక్టర్ ఆమోదంతో సంక్షేమ అధికారులు ఈ మొత్తాన్ని విడుదల చేస్తారని తెలిపారు.
- Advertisement -



