క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి
నవతెలంగాణ-హైదరాబాద్
తెలంగాణలో ఒలింపిక్స్ స్థాయి క్రీడాకారులను తయారు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికబద్దంగా ముందుకెళ్తుందని, ఆ దిశగా ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందించేందుకు కట్టుబడి ఉన్నామని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్ సహా జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించిన క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు అందించేందుకు వీలుగా బడ్జెట్ ప్రణాళికలను రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. స్కూల్ నుంచి యూనివర్శిటీ వరకు క్రీడల్లో సత్తా చాటిన అథ్లెట్లకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుందని మంత్రి చెప్పారు. సోమవారం సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశానికి క్రీడా ప్రాధికార సంస్థ వీసీ, ఎండీ సోనీబాలాదేవి, అధికారులు హాజరయ్యారు.



