Tuesday, March 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంటెన్త్‌ మూల్యాంకనం రేట్లు పెంచండి

టెన్త్‌ మూల్యాంకనం రేట్లు పెంచండి

- Advertisement -

సీఎం రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం రేట్లను పెంచాలని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లోని శాసనమండలి ఆవరణలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆయన కలిసి వినతిపత్రం అందజేశారు. 2018 నుంచి పదో తరగతి మూల్యాంకనం రేట్లు పెంచలేదని గుర్తు చేశారు. రాష్ట్రంలో సుమారు ఐదు వేల మంది రెగ్యులర్‌ ఉద్యోగ, ఉపాధ్యాయులు ఐఎఫ్‌ఎంఐఎస్‌ పోర్టల్‌లో ఆధార్‌ కార్డు అనుసంధానం చేయడంలో ఆధార్‌ మిస్‌ మ్యాచ్‌ కావడం వల్ల ఈనెల వేతనాలు రాలేని పరిస్థితి ఉందని వివరించారు. ఆ ఉద్యోగ, ఉపాధ్యాయులకు మరోసారి ఆధార్‌ అనుసంధానం చేసుకోవడానికి అవకాశం కల్పించాలని కోరారు. ఈ అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందిం చారని తెలిపారు. పదో తరగతి మూల్యాంకనం రేట్ల పెంపుపై సంబంధిత అధికారులు పరిశీలించమని ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. ఆధార్‌ అనుసంధానం అంశంపై ఆర్థిక శాఖ అధికారులకు పరిశీలించాలని ఆదేశిం చారని వివరించారు. దీంతో ఆర్థిక శాఖ అధికారులు ఐఎఫ్‌ఎంఐఎస్‌ పోర్టల్‌లో మూడు రోజులు అవకాశం ఇచ్చారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసిన వారిలో పీఆర్టీయూటీఎస్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పుల్గం దామోదర్‌రెడ్డి, సుంకరి బిక్షంగౌడ్‌, అధికార ప్రతినిధి వంగ మహేందర్‌రెడ్డి, ఆడిట్‌ కమిటీ చైర్మెన్‌ సోమిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గురుకుల టీచర్లకు ఏప్రిల్‌ 30లోపు పదోన్నతులు : మంత్రి అడ్లూరి
రాష్ట్రంలోని అన్ని రకాల గురుకుల పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వలేదని ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం శాసనమండలి ప్రశ్నోత్తరాల్లో ఆయన ఈ అంశంపై మాట్లాడారు. పదోన్నతులు ఇవ్వకపోవడం వల్ల ఎఫ్‌ఏసీలతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మైనార్టీ గురుకుల సమయ సారిణిని మార్చారనీ, మిగిలిన గురుకుల పాఠశాల సమయ సారిణిని మార్చాలని కోరారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ సమాధానమిస్తూ వచ్చేనెల 30లోపు గవర్నింగ్‌ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేసి పదోన్నతులు ఇస్తామని హామీ ఇచ్చారు. మైనార్టీ గురుకుల పాఠశాలల సమయ సారిణి మారిందనీ, మిగిలినవీ మార్పు చేస్తామని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -