– మంత్రి దామోదరకు తెలంగాణ యూనైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ) వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పేద ప్రజలకు వైద్య, సేవలందిస్తున్న వైద్య ఆరోగ్య శాఖకు బడ్జెట్‌లో నిధులు కేటాయింపు పెంచాలని తెలంగాణ యూనైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఆ సంఘం గౌరవాధ్యక్షులు భూపాల్, రాష్ట్ర అధ్యక్షులు ఎండీ ఫసీయుధ్దీన్, ప్రధాన కార్యదర్శి కె యాదానాయక్ ఆదివారం హైదరా బాద్‌లో ఆ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ప్రాధమిక వైద్య రంగన్ని బలోపేతం చేయటం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందు తుందని వారు తెలిపారు. జిల్లా ఆస్పత్రులను పటిష్టం చేసి, వైద్యులు, పారామెడికల్ సిబ్బంది నర్సుల ఖాళీలను భర్తీ చేయాలనీ, 108,102 సేవలను పటిష్ట పర్చాలని వారు మంత్రిని కోరారు.
వైద్య, ఆరోగ్య శాఖకు నిధులు పెంచండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



