Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంజులై 9 సమ్మెతో ఆశా వర్కర్లకు ప్రోత్సాహకాలు పెంపు

జులై 9 సమ్మెతో ఆశా వర్కర్లకు ప్రోత్సాహకాలు పెంపు

- Advertisement -

ఇది ఐక్య పోరాట విజయం : ఏడబ్ల్యూఎఫ్‌ఎఫ్‌ఐ
ఆగస్టు 18న కేరళలో జాతీయ ర్యాలీ
నవతెలంగాణ- న్యూఢిల్లీ బ్యూరో

ఆశా వర్కర్లకు ప్రోత్సాహకాలు పెంచడం జులై 9న జరిగిన సార్వత్రిక సమ్మె విజయమని ఆశా వర్కర్ల యూనియన్‌ ఏడబ్ల్యూఎఫ్‌ఎఫ్‌ఐ పేర్కొంది. ఈ మేరకు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పిపి ప్రేమ, మధుమితా బందోపాధ్యాయ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆశా వర్కర్ల నిరంతర పోరాటాలు, జులై 9 సార్వత్రిక సమ్మెతో కేంద్ర ప్రభుత్వం ఆశా వర్కర్ల ప్రోత్సాహకాల పెంపును ప్రకటించాల్సి వచ్చిందని తెలిపారు. పార్లమెంట్‌లో సీపీఐ(ఎం) ఎంపీ జాన్‌ బ్రిట్టాస్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాపరావు జాదవ్‌ సమాధానం ఇస్తూ ఆశా వర్కర్లకు రూ.3,500 ప్రోత్సాహకాన్ని పెంచినట్టు తెలిపారని పేర్కొన్నారు. జులై 9న కేంద్ర కార్మిక సంఘాలు, సమాఖ్యలు నిర్వహించిన అఖిల భారత సార్వత్రిక సమ్మెలో దాదాపు 80శాతం మంది ఆశాలు పాల్గొన్నారని తెలిపారు. ఇది దేశంలోని ఆశా కార్మికులు, సహాయకుల స్థిరమైన పోరాటాలకు స్పష్టమైన విజయమని వివరించారు. ఆశా వర్కర్లు, ఫెసిలిటేటర్ల ఐక్య పోరాటాలకు అభినందనలు తెలిపారు. ఆగస్టు 18న కేరళలోని తిరువనంతపురంలో జరిగే జాతీయ ర్యాలీలో ఏడబ్ల్యూఎఫ్‌ఎఫ్‌ఐ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తుందని పేర్కొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad