Thursday, September 25, 2025
E-PAPER
Homeబీజినెస్పెరిగిన బీమా కంపెనీల మోసాలు

పెరిగిన బీమా కంపెనీల మోసాలు

- Advertisement -

రెట్టింపైన ఫిర్యాదులు
ఆరోగ్య బీమా సంస్థలపై పాలసీదారుల ఆగ్రహం

న్యూఢిల్లీ: అనారోగ్యం పాలయినప్పుడు అత్యవసర సమయంలో వైద్య బీమా ఉంటే ఎంతో ధీమాగా ఉంటుందని పాలసీలు కొనుగోలు చేసిన వారికి అంతిమంగా నిరాశనే ఎదురవుతోంది. హాస్పి టల్‌లో చేరిన తర్వాత అడ్డగోలు షరతులు పెట్టి.. బీమా వర్తింపునకు సంబంధిత సంస్థలు మోకాలడ్డు వేస్తోన్నాయని రిపోర్టులు వస్తోన్నాయి. వైద్య బీమా కంపెనీలపై ఫిర్యాదులు దాదాపు రెట్టింపు కావడమే ఇందుకు నిదర్శనం. ఈ ఏడాది జూన్‌తో ముగిసిన రెండవ త్రైమాసికంలో బీమా ఉత్పత్తులపై ఫిర్యాదులు 45 శాతం పెరిగాయని.. ఇందులో ఎక్కువగా ఆరోగ్య బీమా పాలసీలపైనే ఉన్నాయని ‘ఇన్సూరెన్స్‌ సమాధాన్‌’ తన 2025 రిపోర్ట్‌లో వెల్లడించింది. బీమా రంగంలోని తీరుతెన్నులను విశ్లేషిస్తూ ఆ సంస్థ ఓ నివేదికను విడుదల చేసింది.

ఆ వివరాలు.. ఫిర్యాదులు దాఖలు చేయడంలో 31 నుంచి 40సంవత్సరాల వయస్సు గల పాలసీదారు లు అత్యంత చురుకుగా ఉన్నారు. దేశంలో ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 16 శాతం ఫిర్యాదులు చోటు చేసుకున్నాయి. పాలసీదారులకు తప్పుగా విక్రయించడం, క్లెయిమ్‌ వివాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది మార్చితో ముగిసిన మొదటి త్రైమాసికంలో 684 ఫిర్యాదులు నమోదు కాగా, రెండవ త్రైమాసికంలో 974 ఫిర్యాదులు నమోదయ్యాయి. ఇది 45 శాతం పెరుగుదల. వివాదాస్పద క్లెయిమ్‌ల విలువ రూ.83.5 కోట్ల నుండి రూ.119.5 కోట్లకు పెరిగింది. ఇది 43 శాతం కంటే ఎక్కువ పెరగడం ఆందోళనకరం.

తప్పుగా విక్రయించడం..
తప్పు దారి పట్టించే బీమా ఉత్పత్తుల విక్రయా లపై ఫిర్యాదులు 11.2 శాతం పెరిగాయి. ఇందులో ఆరోగ్య బీమా ఫిర్యాదులు 68 శాతం పెరగ్గా.. జీవన బీమాపై 25.5 శాతం, సాధారణ బీమాపై 6.9 శాతం చొప్పున ఫిర్యాదులు పెరిగాయి. ఎండోమెంట్‌ పాలసీలు అత్యంత తప్పుగా విక్రయిం చిన వాటిలో ఎక్కువగా ఉన్నాయి. ఇవి పాలసీదారులను జరిమా నాలు, తక్కువ రాబడి, మూలధన క్షీణతకు గురి చేస్తున్నాయని పాలసీదారులు ఫిర్యాదు చేశారు. పాలసీదారులు, ముఖ్యంగా యువతరాలు, తమ హక్కుల కోసం నిలబడుతున్నారని ఇన్సూరెన్స్‌ సమా ధాన్‌ సహవ్యవస్థాపకురాలు, చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ శిల్పా అరోరా తెలిపారు. ఏజెంట్లపై అధిక కమిషన్లు, విక్రయ ఒత్తిడి కారణంగా తప్పుదారి పట్టి ంచే విక్రయ ఫిర్యాదులు పెరుగుతున్నాయన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -