Sunday, November 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెరిగిన మెస్ చార్జీలు.!

పెరిగిన మెస్ చార్జీలు.!

- Advertisement -

వంట ఏజెన్సీలకు ఊరట
నవతెలంగాణ – మల్హర్ రావు:

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకుల ఎదురుచూపులకు తెర పడింది.రాష్ట్ర ప్రభుత్వం ధరలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలను జూలై నుంచి అమలు చేయనుంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం..
మండలంలో 15 గ్రామాల్లోని 34 పాఠశాలల్లో చదివే 1367 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతోంది.ప్రభు త్వమే సన్న బియ్యం సమకూరుస్తుండగా పప్పు, ఉప్పు, నూనె, కోడిగుడ్లు తదితర వంట సామగ్రి, కూరగాయలను నిర్వాహకులు కొనుగోలు చేస్తున్నారు. వీటికయ్యే ఖర్చును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తున్నాయి. ఏజెన్సీలకు చెల్లించే బిల్లులో కేం ద్ర ప్రభుత్వం వాటా 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం వాటా 40 శాతంగా ఉంది. తాజాగా పెరిగిన ధరలతో పాటు పాత బకాయిలు కూడా సత్వరమే చెల్లిం చాలని ఏజెన్సీల నిర్వాహకులు కోరుతున్నారు.

విద్యార్థుల మెనూ ఇదీ..
విద్యార్థులకు సోమవారం, బుధవారం, శుక్రవారం కోడిగుడ్లు ఇవ్వాలి. రోజువారీగా మిక్స్డ్ కూర గాయాలు,చారు, ఆకు కూరలు, పప్పు, రాగిజావ అందించాలి. గురువారం వెజిటేబుల్ బిర్యానీ అందించాలి.ఇందుకోసం ఇది వరకు ఒక్కోవిద్యార్ధికి పీఎస్ స్కూల్లో రూ.5.45 అందించగా పెరిగిన బిల్లుల ప్రకారం రూ.6.19 అందిస్తారు. యూపీఎస్ లో గతంలో రూ.8.17 ఉండగా ప్రస్తుతం రూ.9.29 అందించనున్నారు. హైస్కూల్ విద్యార్థులకు గతంలో రూ.10.67 ఉండగా ప్రస్తుతం రూ.11.79 అందించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -