Saturday, August 2, 2025
E-PAPER
Homeఖమ్మంపెరిగిన పామాయిల్ గెలలు ధరలు

పెరిగిన పామాయిల్ గెలలు ధరలు

- Advertisement -

2022 నాటి ధరలు ఈ ఏడాది పునరావృతం…
జులై నెలకు మెట్రిక్ టన్ను రూ. 18052 లు…
నవతెలంగాణ – అశ్వారావుపేట

పామాయిల్ గెలలు దిగుబడికి తగ్గట్టే గెలలు ధర జులై నెల కు పెరిగింది. అంతర్జాతీయ బహిరంగ మార్కెట్ లో ముడి పామాయిల్,నట్ లు క్రయవిక్రయాలు ఆధారంగా ప్రతీ నెలా ఆయిల్ ఫెడ్ గెలలు ధరను ప్రకటిస్తుంది. ఈ క్రమంలో శుక్రవారం జులై నెలకు రైతులకు చెల్లించే గెలలు ధరను ఆయిల్ ఫెడ్ ప్రకటించింది.మెట్రిక్ టన్ను గెలలు ధర రూ.18052 లు గా ఆయిల్ ఫెడ్ ఉన్నతాధికారులు ప్రకటించారు.దీంతో ఒక్కో మెట్రిక్ టన్నులు జూన్ నెల కంటే జులై లో రూ.589 లు పెరిగింది.జూన్ లో టన్ను గెలలు ధర రూ.17463 లు గా రైతులకు చెల్లించారు.

ఈ ఆర్ధిక సంవత్సరంలో గడిచిన 4 నెలలు అంటే జనవరి,ఫిబ్రవరి,మార్చి,ఏప్రిల్ వరకు టన్ను గెలలు ధర రూ.20 వేలు పై చిలుకు ఉంది.తర్వాత 3 నెలలు అంటే  మే,జులై ల్లో టన్ను గెలలు ధర రూ.18 వేలు పై చిలుకు ఉండగా జూన్ లో మాత్రం రూ.17 వేలు పై మాటే.2023 ఏప్రిల్ లో రూ.14 వేలు పైన,ఫిబ్రవరి,మార్చి,మే,జులై,ఆగస్ట్ ల్లో 13 వేలు పైన,జూన్,సెప్టెంబర్,అక్టోబర్,నవంబర్,డిసెంబర్ ల్లో రూ.12 వేలు పై చిలుకు ధరలు ఉన్నాయి.

2024 ఆర్ధిక సంవత్సరం జనవరి లో రూ.12 వేలు పైన,ఫిబ్రవరి,మే,జూన్,జులై ల్లో రూ.13 వేలు పైన,మార్చి,ఏప్రిల్,ఆగస్ట్ ల్లో రూ.14 వేలు పైనే ధర ఉంది.సెప్టెంబర్ లో రూ.17 వేలు చిల్లర,అక్టోబర్ రూ.18 వేలు పైన,నవంబర్,డిసెంబర్ లో రూ.20 వేలు పైన పెరుగుతూ వచ్చి 2025 ఏప్రిల్ వరకు రూ. 20 వేలు పై చిలుకు ధరలు నిలకడగా సాగాయి.మే,జులై ల్లో రూ.18 వేలు పైన,జూన్ లో రూ.17 వేలు పైన ధర పలికింది. అయితే 2022 లో ఈ ఏడు నెలల ధరలతో , 2025 సంవత్సరంలో  ఈ ఏడు నెలలు ధరలు పోటీ పడుతున్నాయి. వివరాలను క్రింది ఇచ్చాము. గమనించగలరు.

Oplus_131072
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -