Friday, August 15, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ప్రెస్ క్లబ్ లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ప్రెస్ క్లబ్ లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

- Advertisement -

బహుమతుల అందజేత 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 

నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ప్రెస్ క్లబ్ ఆవరణలో అధ్యక్షులు రామకృష్ణ జాతీయ జండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రామకృష్ణ, కార్యదర్శి శేఖర్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం నిర్వహించే స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఈ సంవత్సరం ప్రెస్ క్లబ్ ఆవరణంలో ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు క్రికెట్, క్యారం బోర్డ్, చెస్, బ్యాట్మెంటన్ పోటీలను నిర్వహించామని ఇందులో గెలుపొందిన జర్నలిస్టు క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.

ఐశ్వర్యం హోమ్స్ అండ్ బిల్డర్స్ మధు టోర్నమెంట్ కు స్పాన్సర్స్ గా సహకారం అందించారు. క్రికెట్, షటిల్, చెస్, క్యారం పోటీల్లో క్రీడా స్ఫూర్తిని చాటిన జర్నలిస్టులకు ఆ సంస్థ నిర్వాహకులు మధు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రామకృష్ణ, కార్యదర్శి శేఖర్ ల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. నిత్యం విధి నిర్వహణలో ఒత్తిడులకు లోనవుతున్న జర్నలిస్టులు ఆటల పోటీలతో ఒత్తిడులు దూరం అవుతాయని ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారని మధు అన్నారు.జర్నలిస్టు కార్యక్రమాలకు ఎల్లప్పుడు సహకరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు, నగర జర్నలిస్టులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad