నవతెలంగాణ – పరకాల
పరకాల పట్టణంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. శుక్రవారం స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వాడవాడలా మువ్వన్నెల జెండాను ఎగరవేశారు. పట్టణములో ప్రభుత్వ కార్యాలయాలతో పాటు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు, పలు పార్టీలు ప్రజా సంఘాల వ్యాపార వాణిజ్య సముదాయాలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో జాతీయ జెండా విస్తరించడం జరిగింది. పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంతో పాటు అమరదామంలో స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు.
మున్సిపల్ కార్యాలయంలో కొడారి సుష్మ, ఆర్డీవో కార్యాలయంలో డాక్టర్ కె నారాయణ, తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ తోట విజయలక్ష్మి, ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ సుధీర్ బాబు, పోలీస్ స్టేషన్లో సీఐ క్రాంతి కుమార్, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో పెద్ది ఆంజనేయులు, ఐసిడిఎస్ కార్యాలయంలో సిడిపిఓ జాతీయ జెండా ఆవిష్కరించి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. మండలంలోని కామారెడ్డి పల్లి, నాగారం, పోచారం, అలియాబాద్, మలక్కపేట, వెంకటాపూర్, హైబోత్ పల్లి, వెల్లంపల్లి ఆయా గ్రామపంచాలలో పంచాయతీ కార్యదర్శిలు, జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES