ఎనిమిది వేదికల్లో పొట్టి ప్రపంచకప్ పోరు
పాకిస్తాన్ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో నిర్వహణ
ఐసీసీ టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
నవతెలంగాణ-దుబాయ్
ఐసీసీ 2026 టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ వచ్చేసింది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం వహిస్తున్న మెగా ఈవెంట్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ఆరంభం కానుంది. ముంబయి వాంఖడె స్టేడియంలో ఆరంభ వేడుకలు, అహ్మదాబాద్ మొతెరా స్టేడియంలో టైటిల్ పోరు జరుగుతుంది. ఈ మేరకు టోర్నమెంట్ షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం విడుదల చేసింది. 20 జట్లు పోటీపడుతున్న 29 రోజుల మెగా ఈవెంట్‌కు భారత్‌కు ఐదు, శ్రీలంకలో మూడు స్టేడియాలు ఆతిథ్యం ఇస్తున్నాయి. చెన్నై, ముంబయి, కోల్‌కతా, న్యూఢిల్లీ, అహ్మదాబాద్ సహా ప్రేమదాస స్టేడియం, సింహాలీస్ స్పోర్ట్స్ క్లబ్, క్యాండీ స్టేడియాలు వేదికలుగా ఎంపికయ్యాయి. ఫిబ్రవరి 7న ఆరంభం కానున్న ప్రపంచకప్.. మార్చి 8న ఫైనల్‌తో ముగియనుంది.
ఫిబ్రవరి 15న దాయాదుల ఢీ :
డిఫెండింగ్ చాంపియన్ భారత్.. గ్రూప్-ఏలో యుఎస్‌ఏ, నెదర్లాండ్స్, నమీబియా, పాకిస్తాన్‌తో పోటీపడనుంది. ఫిబ్రవరి 7న ముంబయిలో యుఎస్‌ఏతో భారత్ తొలి మ్యాచ్‌లో ఆడనుంది. 12న న్యూఢిల్లీలో నమీబియాతో, 15న కొలంబోలో పాకిస్తాన్‌తో, 18న అహ్మదాబాద్‌లో నెదర్లాండ్స్‌తో భారత్ తలపడనుంది. 20 జట్లు ఐదు గ్రూప్‌లుగా గ్రూప్ దశలో ఆడనుండగా.. ప్రతి గ్రూప్ నుంచి టాప్-2 జట్లు సూపర్-8కు అర్హత సాధిస్తాయి. సూపర్8లో టాప్-4లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. దీంతో భారత్, పాకిస్తాన్ కనీసం రెండు సార్లు తలపడే అవకాశం ఉంది. గ్రూప్ దశలో 40 మ్యాచ్‌లు జరుగుతాయి. ఫిబ్రవరి 21 నుంచి సూపర్8 మ్యాచ్‌లు ఉంటాయి. మార్చి 4న తొలి సెమీఫైనల్‌కు కోల్‌కతా, 5న రెండో సెమీస్‌కు ముంబయి ఆతిథ్యం ఇస్తాయి. పాకిస్తాన్ సెమీస్‌కు చేరుకుంటే.. తొలి సెమీస్ కొలంబోలో ఉంటుంది. మార్చి 8న అహ్మదాబాద్‌లో ఫైనల్ షెడ్యూల్ చేయగా.. పాక్ టైటిల్ పోరుకు చేరుకుంటే వేదిక శ్రీలంకకు మారుతుంది. పాకిస్తాన్ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించారు. గ్రూప్ దశలో ప్రతి రోజు మూడు మ్యాచులు జరుగుతాయి. తొలి మ్యాచ్ ఉదయం 11 గంటలకు, రెండో మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు, మూడో మ్యాచ్ రాత్రి 7 గంటలకు ఆరంభం అవుతాయి.
టీ20 ప్రపంచకప్ వేదికలు
గ్రూప్ దశ : ముంబయి, చెన్నై, కోల్‌కతా, న్యూఢిల్లీ, అహ్మదాబాద్, కొలంబో ప్రేమదాస, ఎస్‌ఎస్‌ఆర్ కొలంబో, క్యాండీ.
సెమీఫైనల్ : ముంబయి, కోల్‌కతా/కొలంబో. ఫైనల్ : అహ్మదాబాద్/కొలంబో.
టీ20 ప్రపంచకప్ గ్రూప్‌లు
గ్రూప్-ఏ : భారత్, యుఎస్‌ఏ, నమీబియా, నెదర్లాండ్స్, పాకిస్తాన్
గ్రూప్-బి : ఆస్ట్రేలియా, శ్రీలంక, జింబాబ్వే, ఐర్లాండ్, ఓమన్
గ్రూప్-సి : ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, ఇటలీ, నేపాల్
గ్రూప్-డి : దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, కెనడా, యుఏఈ.
భారత్, పాక్ మళ్లీ ఒకే గ్రూప్‌లో..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



