Friday, March 27, 2026
E-PAPER
Homeఆటలుఈ స్పోర్ట్స్‌ నేషన్స్‌కప్‌లో భారత్‌

ఈ స్పోర్ట్స్‌ నేషన్స్‌కప్‌లో భారత్‌

- Advertisement -

ముంబై: రియాద్‌ వేదికగా నవంబర్‌ 2నుంచి 29తేదీల మధ్య జరిగే ఈ స్పోర్ట్స్‌ నేషన్స్‌కప్‌లో భారత్‌ బరిలోకి దిగుతున్నది. ఇందుకోసం నాడ్విన్‌ గేమింగ్‌ను జాతీయ జట్టు భాగస్వామిగా నాడ్విన్‌ గేమింగ్‌ను స్పోర్ట్స్‌ ఫౌండేషన్‌(ఈఎఫ్‌) నియమించుకుంది. గత దశాబ్ద కాలంగా ఈ స్పోర్ట్స్‌ గేమింగ్‌ అభివద్ధిలో నాడ్విన్‌ గేమింగ్‌ కీలక పాత్ర పోషిస్తున్నది. అంతర్జాతీయ టోర్నీల్లో భారత్‌ సత్తాచాటేందుకు మెరుగైన జట్టును నిర్మించడంతో పాటు పోటీ వాతావరణం కల్పించడం, గేమ్‌ టైటిల్స్‌కు అనుగుణంగా కోచ్‌లకు మద్దతుగా నిలువడంలో నాడ్విన్‌ అన్ని రకాలుగా సహాయ, సహకారాలు అందించనుంది. ఈ విషయాన్ని స్పోర్ట్స్‌ ఫౌండేషన్‌ గ్లోబల్‌ హెడ్‌ నిమిత్‌ రౌత్‌తో పాటు నాడ్విన్‌ గేమింగ్‌ డైరెక్టర్‌ హన్స్‌ జాగ్నో ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రియాద్‌లో జరిగే టోర్నీ కోసం మొత్తం 414 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -