Thursday, January 1, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఅప్పుల భారతం-అసమానతల సమాజం

అప్పుల భారతం-అసమానతల సమాజం

- Advertisement -

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో భారతదేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. దాని ప్రభావం అన్నివర్గాలపై పడుతున్నది. ఎందుకంటే, ఇవాళ దేశం ఎదుర్కొంటున్న సమస్యలను విడివిడిగా చూడలేని పరిస్థితి. రైతుల బాధలు, కార్మికుల అభద్రత, మధ్యతరగతి కుటుంబాలపై పెరుగుతున్న ఆర్థిక ఒత్తిడి, ప్రజాస్వామ్య హక్కుల క్రమబద్ధమైన సంకోచం, ఇవన్నీ పరస్పరం సంబంధం లేని పరిణామాలు కావు. వీటిని ఏ రకంగా చూసినా ఒకే విధాన దిశలో సాగుతున్న రాజకీయ, ఆర్థిక నిర్ణయాల ఫలితాలు. కార్పొరేట్‌ లాభాలను అభివృద్ధిగా చూపుతూ, శ్రమజీవుల జీవితాలను పక్కకునెట్టే ఈమార్గమే దేశాన్ని నేడు ఈ దుస్థితిలో పడేసింది.

2014 మే 26 మొదలుకుని 2025 డిసెంబర్‌ 26 తేదీ నాటికి మోడీ ప్రధానిగా పదకొండు సంవత్సరాల ఐదు నెలల కాలం పూర్తయింది. మూడో సారి ప్రాంతీయ పార్టీల మద్దతుతో ప్రధాని పీఠం మీద కూర్చున్న మోడీ, పాలనలో మునుపెన్నడూ లేని విధంగా దేశ ఆర్థిక పరిస్థితి పాతాళంలోకి దిగజారింది. అడ్డూఅదుపు లేకుండా ప్రజలపై మోయలేని పన్నుల భారం పెరిగింది. తొంభైశాతం దేశ ప్రజలకు తీరని అన్యాయం చేస్తూ ప్రజా సంపదను కొల్లగొట్టే కార్పొరేట్‌ సంస్థలకు లక్షల కోట్ల రూపాయల రాయతీలిస్తున్నది. రైతులు, శ్రామికవర్గ పేదలకు ఇచ్చే రాయితీలను మాత్రం కోత పెడు తున్నది.అలాగే ఈ మధ్యకాలంలో రైతులు, కార్మికులు, గ్రామీణ పేదల పొట్ట కొట్టే కొత్త చట్టాల్ని రూపొందించింది. ప్రభుత్వ రంగంలోని వివిధ సంస్థలను హోల్‌సేల్‌గా అమ్మేస్తున్నది. దేశ విదేశీ అప్పులు 200 లక్షల కోట్ల రూపాయలు దాటింది. రాష్ట్రాల అధికారాలను తమ చేతుల్లోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాలను నిర్వీర్యం చేయడం, బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాల పట్ల వివక్ష పూరితంగా వ్యవహరించడం యథేచ్ఛగా కొనసాగుతున్నది. తమ విధానాలను ప్రశ్నించి వ్యతిరేకించే వారిపై దేశద్రోహ ముద్రవేసి జైళ్లలో నిర్బంధిస్తున్నది. మత విద్వేషాలు రెచ్చగొడుతూ, తమ పార్టీకి ఓటు వేయరని భావించే ప్రజల ఓట్లను ‘సర్‌’ పేరుతో తొలగిస్తున్నది. అవసరం లేకున్నా అగ్రరాజ్యాల ఒత్తిడితో వ్యవ సాయ ఉత్పత్తులతో సహా అనేక సరుకులను దిగుమతి చేసు కుంటున్నది. దీని వలన పదకొండు లక్షల కోట్ల రూపాయల లోటుతో దేశ ఖజానాకు నష్టం జరుగుతోంది. సాగుకు అవకాశం ఉన్న వ్యవసాయ ఉత్పత్తులతో సహా అనేక సరుకులను దిగుమతి చేసుకోవడం వలన మన వ్యవసాయానికి నష్టం వాటిల్లుతోంది. ఉదాహరణకు, చాలారకాల పండ్లు, కూరగాయలు, పామాయిల్‌ సాగుకు దేశంలో అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడి రైతు లను ప్రోత్స హించకుండా విదేశాల నుండి దిగుమతులు చేసుకుంటున్నది. అలాగే విత్తన చట్టం ద్వారా అనేక రకాల విత్తనాలను స్వదేశీ విదేశీ కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెట్టింది. దీని వలన రైతాంగం స్వదేశీ విదేశీ కంపెనీల విత్తనాలను సేద్యానికి వాడుకోవాల్సి ఉంటుంది. దేశంలోని అనేక ప్రాంతాలలో రకరకాల విత్తనాలను సాగుచేసే తెలివిగల రైతాంగం ఉన్నది. తెలంగాణ ప్రాంతం నుంచి విదే శాలకు ఇరవై రకాల విత్తనాలను ఎగుమతి చేస్తున్న పరిస్థితికి మోడీ ప్రభుత్వం తెచ్చిన విత్తనచట్టం బ్రేక్‌ వేసింది.

కుదేలైన వ్యవసాయ రంగం
ప్రధాని మోడీ దేశ ఆర్థికవ్యవస్థను ప్రపంచదేశాల్లో నెంబర్‌ వన్‌గా నిలుపుతానని, మేకిన్‌ ఇండియా, ఆత్మనిర్భర్‌ భారత్‌ అని రకరకాల పేర్లతో వాగాడంబరం ప్రదర్శించారు, తప్ప ఆచరణలో ఆవగింజంత మేలు జరగలేదు. దేశీయ ఉత్పాదకరంగం కుదే లైంది. అది óకారిక లెక్కల ప్రకారమే అనేక చిన్న మధ్యతరహా పరి శ్రమల మూతతో ‘మేక్‌ఇన్‌ ఇండియా’ డొల్లతనం స్పష్టమైంది. వంటనూనెలు, పప్పులు, కూరగాయలు, పండ్లు, పంచదార మాంసం, తృణ ధాన్యాలు పాల ఉత్పత్తులకు దేశీ యంగా మోడీ ప్రభుత్వం చేయూతనివ్వడం లేదు. ఇబ్బడిముబ్బడిగా దిగుమ తులు చేస్తున్నారు. వ్యవ సాయరంగంలో 2004లో ఎం.ఎస్‌ స్వామినాథన్‌ కమిటీ చేసిన సిఫారసులు ఇప్పటికీ అమలుకు నోచు కోలేదు. ఆ కమిటీ సిఫారసుల ప్రకారం రైతులకు మద్దతు ధర, రుణ పరపతి సౌకర్యం విస్తృతం చేసి సబ్సిడీలందిస్తే విదేశీ వాణిజ్యలోటు తగ్గేది. అభివృద్ధి చెందిన అమెరికాలో రైతులకు భారీ సబ్సిడీలు అందిస్తున్నారు. కానీ, నూట నలభై కోట్ల మందికి పైగా ప్రజలకు ఆహార మందిస్తున్న రైతుల కోసం ప్రభుత్వ సాయమేమీ లేదు. దేశంలో కీలకమైన వ్యవసాయం రంగం మీద రైతులతో సహా యాభై రెండు శాతం, పరోక్షంగా పది ాతం మంది బతుకుతున్నారు. దేశానికి వెన్నె ముకగా ఉన్న వ్యవసాయం గిట్టుబాటుకాక రైతులు ఆత్మ హత్యలకు పాల్పడుతున్నారు.

గ్రామీణుల పొట్టకొట్టే చట్టం ‘వి బి జీ రామ్‌ జీ’
గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు వంద రోజులు ఉపాధి కల్పించడానికి వామపక్షాల ఒత్తిడితో, 2005లో చట్టంగా వచ్చిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును వి బి జీ రామ్‌ జీగా మార్పు చేస్తూ తాజాగా పార్లమెంటులో చట్టం చేశారు. గతంలో దేశ వ్యాప్తంగా అమలైన ఈ పథకం ద్వారా చిన్న రైతులతో పాటు వ్యవసాయ కార్మికులు జీవనం సాగిస్తున్నారు. 2025 లెక్కల ప్రకారం గ్రామీణ ఉపాధిహామీ ద్వారా పని చేయడానికి ఆంధ్రప్రదేశ్‌లో కోటి పది లక్షల మంది, తెలం గాణలో కోటి మందికి పైగా కార్మికులుగా నమోదు చేసు కున్నారు. ఈ కార్యక్రమంలో మొత్తం పనిదినాలలో అరవై శాతం పైగా మహిళలు పాల్గొంటున్నారు. ముప్ఫయి వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఇదివరకటి ఉపాధి చట్టం ప్రకారం తొంభై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం, పది శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చడం ఉంది. కొత్తగా వచ్చిన ‘రామ్‌ జీ’ పథకానికి కేంద్రం తన వాటాను అరవై శాతానికి కుదించింది. రాష్ట్ర వాటాను నలభై శాతానికి పెంచింది. ఇదివరకు గ్రామీణ ఉపాధి పనిహక్కు అనేది చట్టబద్ధంగా ఉంది. ఇప్పటి జీ రామ్‌ జీ లో ఆ అవకాశం లేదు. పని కల్పించడం, నిలిపివేయడం మోడీ ప్రభుత్వ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటుంది. అంతే కాకుండా ఇదివరకటి మాదిరిగా దీన్ని దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలనే అవకాశం లేదు. పైగా ఈ కార్యక్ర మాన్ని ఎక్కడ అమలు చేయాలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. దీన్ని కొన్ని జిల్లాలు, మండలాలు, ప్రాం తాలకు మాత్రమే పరిమితం చేసే మార్పులు కొత్త పథకంలో ఉన్నాయి. జీఎస్టీ చట్టం ద్వారా రాష్ట్రాల ఆదాయ వనరును కైవసం చేసుకున్న కేంద్ర ప్రభుత్వం చర్యతో రాష్ట్రాలు నిధులు లేక నీరసిస్తున్నాయి. ఈ క్రమంలో మార్పు చేసిన ఉపాధి హామీ పథకానికి రాష్ట్రాల వాటాను పెంచడంతో ఆశించిన లక్ష్యం నీరుగారిపోతుంది. వ్యవ సాయం పనులు లేనికాలంలో, ఈ పథకం ద్వారా వచ్చే ఆదా యంతో జీవనం సాగిస్తున్న లక్షలాది వ్యవసాయ కార్మికులు, చిన్న రైతుల కుటుంబాలతో పాటు సిబ్బంది భవిష్యత్తు అగమ్య గోచ రంగా పరిణమిస్తుంది. యేటా రెండుకోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ చేసిన వాగ్దానాన్ని తిరగేసి, దేశవ్యాప్తంగా కోట్లాది మంది గ్రామీణ కార్మికుల ఉపాధిని తొలగించే ప్రమాదం జీ రామ్‌ జీ పథకంలో పొంచి ఉంది.

కార్పొరేట్ల అనుకూల విధానాలు
ప్రధాని మోడీ దేశంలో వందల సంఖ్యలో ఉన్న పెట్టుబడి దారుల కుటుంబాల ఖజానా నింపే అక్షయ పాత్రగా, సామాన్య ప్రజల జీవితాలను పాతాళంలోకి తొక్కే ఆర్థిక విధానాలు కొనసాగిస్తున్నారు. కార్పోరేట్‌ అనుకూల విధానాల వలన దేశంలో ఒక శాతం మంది చేతుల్లో నలభైశాతం పైగా జాతీయ సంపద పోగైంది. బీజేపీ అధికారంలోకి వచ్చింది మొదలు బడా పారి శ్రామికవేత్తలు వాణిజ్యవేత్తల లాభాలు విపరీతంగా పెరిగాయి. 2015- 2024 మధ్యకాలంలో భారీ పరిశ్రమలకు సంబంధించి, పార్లమెంట్‌ సాక్షిగా 9,26,947 కోట్ల రూపాయల రుణాలను పాతబాకీలుగా ప్రకటించారు. 2020-2024 కాలంలో కార్పొరేట్‌ సంస్థల నుంచి రావలసిన 3,67,261 కోట్ల రాబడిని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. మరోవైపు కేంద్రం ఆమోదించిన నాలుగు లేబర్‌కోడ్‌లతో కార్మికుల జీవితాలను పారిశ్రామిక సంస్థలకు తాకట్టు పెట్టే కార్యక్రమం మొదలైంది. కార్మికుల సంక్షేమం కోసం, బ్రిటిష్‌ ప్రభుత్వ హయాంలో 1926లో చేసిన ట్రేడ్‌ యూనియన్‌ హక్కులు నాలుగు లేబర్‌కోడ్‌లతో ప్రమాదంలో పడ్డాయి. ఎనిమిది గంటల పని దినం నుంచి పది, పన్నెడు గంటల పని దినం కావాలని కార్పోరేట్‌ శక్తులు చేస్తున్న ప్రచారం పట్ల మోడీ ప్రభుత్వం మిన్నకుంది. దీన్ని బట్టి కేంద్ర ప్రభుత్వ పెట్టుబడిదారుల అనుకూల విధానం స్పష్టమవుతుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు రోజువారీ కనీస వేతనం 465 రూపాయలుగా కేంద్ర లేబర్‌ కమిషన్‌ ప్రకటిం చింది. పెరిగిన ధరలకు అనుగుణంగా ఈ వేతనంతో కార్మికుల కుటుంబాలు పిల్లల చదువులు, జీవనభృతికి జీవన్మరణ సమస్య ఎదుర్కోక తప్పదు. ఇక ప్రయివేటు రంగంలో కార్మికుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం తనవంతుగా రూపాయి కూడా చెల్లించకుండా యాజమాన్యాల నుంచే దాన్ని జమ చేయించాలని చట్టం చేసింది. దీనివల్ల యాజమాన్యాలు తమ వాటా సొమ్మును కూడా కార్మికుడి వేతనం నుంచే కోత కోసే అవకాశం ఉంది. 25ఏండ్ల నుంచి 30 ఏండ్లు ఒకే సంస్థలో పని చేసి రిటైర్‌ అయిన కార్మికునికి ఇ.పి.ఎస్‌ పేరున ఇస్తున్న పింఛన్‌ అత్యధిక మందికి మూడువేల రూపాయలకు మిం చడం లేదు. ఈ పింఛన్‌ను తొమ్మిది వేల రూపాయలకు పెంచాలని కార్మికులు మొరపెట్టు కుంటున్నా మోడీ ప్రభుత్వానికి చెవికెక్కడం లేదు. కాని ఎన్‌.పి.ఎస్‌, యు.పి.ఎస్‌ పేరుతో కార్మికులు తమ జీవితకాలంలో జీతం నుంచి పొదుపు చేసుకున్న సొమ్మును మాత్రం షేర్‌ మార్కెట్‌లో కార్పొరేట్లకు పెట్టుబడిగా పెడుతోంది.

దేశాన్ని అప్పులకుప్పగా మార్చిన మోడీ
ప్రజా సంక్షేమానికి తూట్లు పొడుస్తూ కార్పొరేట్‌ శక్తులకు కల్పతరువుగా వ్యవహరిస్తున్న మోడీ ప్రభుత్వం దేశాన్ని అప్పులకుప్పగా మార్చింది. ఇటీవల (నవంబర్‌ 2025లో) రాజ్యసభలో సీపీఐ(ఎం) ఎంపీ శివదాసన్‌ అడిగిన ప్రశ్నకు సమాధానంగా వెల్లడించిన అధికారిక సమాచారం ప్రకారం, రాబోయే కాలంలో దేశ ప్రజల భవిష్యత్తు ఎంత ప్రమాదకరంగా పరిమణించబోతుందో అర్థమవుతుంది. 2025లో 177.20 లక్షల కోట్లు స్వదేశీ రుణం, 8.74 లక్షల కోట్లు విదేశీ రుణం ఉంది. 2020-21లో మొత్తం అప్పులు 121.86 లక్షల కోట్లు కాగా, 115.71 లక్షల కోట్లు స్వదేశీ రుణం, 6.15 లక్షల కోట్లు విదేశీ రుణం ఉంది. మొత్తం మీద 2025-26 బడ్జెట్‌ అంచనా ప్రకారం దేశ రుణ భారం 200.16 లక్షల కోట్ల రూపాయలకు పెరుగుతుందని తెలిపింది. ఇదిలా ఉండగా 2021లో వడ్డీ చెల్లింపులు 6.80 లక్షల కోట్ల రూపాయలు కాగా 2024-25లో ఇది 11.16 లక్షల కోట్లకు పెరిగింది. ప్రధాని మోడీ ప్రవచిత ‘మేకిన్‌’ ఇండియాలో పదుల సంఖ్యలో ఉన్న కార్పొరేట్‌ వర్గాలు ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోతుండగా కోట్లాదిమంది కార్మికులు, కర్షకులు, వివిధ వృత్తుల సామాన్య ప్రజలు, ఉద్యోగ వర్గాలు దారిద్య్రపు అంచులకు చేరే పరిస్థితి ఏర్పడింది. ఇదంతా సమాజంలో అసమానతలను పెంచిపోషిస్తోంది. ధనవంతులు కుబేరులుగా తేలుతుండగా, పేదలు మరింత కటిక దారిద్య్రంలో మునుగుతున్నారు. అలాగే 2014లో డాలర్‌తో 60 రూపాయలు విలువ కలిగిన మన రూపాయి, 2025 నవంబర్‌లో డాలర్‌కు 90.80కి పతనమైంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే కాలంలో డాలర్‌కు వంద రూపాయలుగా మన కరెన్సీ దిగజారే గడ్డుకాలం ఏర్పడనుంది. కొత్త ఏడాదిలోనైనా పేద,ధనికల అసమానతలు మారాలి. ప్రజామోద పాలనతో సాగాలి. లేనిపక్షంలో సమస్త వర్గాల ప్రజలు సంఘటితమవ్వాలి. ప్రగతిశీల శక్తులతో కలిసి ఉద్య మించాలి. మోడీ సర్కార్‌ అవలంభిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాల్ని తిప్పికొట్టాలి.

జూలకంటి రంగారెడ్డి 9490098349

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -