- Advertisement -
హైదరాబాద్ : ఇండియన్ ప్యాడెల్ ఓపెన్‌లో స్పెయిన్ డబుల్ ధమాకా. పురుషుల, మహిళల డబుల్స్ విభాగంలో స్పెయిన్ క్రీడాకారులు టైటిల్స్ సాధించారు. మహిళల డబుల్స్ ఫైనల్లో 6-3, 4-6, 6-1తో కోయెక్, కుర్జ్‌లపై అలర్జా, లుజాన్ (స్పెయిన్) మూడు సెట్ల మ్యాచ్‌లో గెలుపొందారు. పురుషుల డబుల్స్ ఫైనల్లో సహచర స్పెయిన్ ప్లేయర్లు బెర్నాల్, జురితాలపై శాంటియాగో, బెల్మాంట్‌లు 6-3, 7-5తో వరుస సెట్లలో విజయం సాధించారు. మహిళల, పురుషుల డబుల్స్‌లో భారత ప్లేయర్ల పోరాటానికి సెమీఫైనల్లోనే తెరపడింది.
- Advertisement -