Tuesday, July 8, 2025
E-PAPER
Homeఆటలులండన్‌లో అడుగుపెట్టిన భారత జట్టు

లండన్‌లో అడుగుపెట్టిన భారత జట్టు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో కీలకమైన మూడో పోరుకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు లండన్ నగరానికి చేరుకుంది. మంగళవారం లండన్‌లోని హీత్రూ విమానాశ్రయానికి చేరుకున్న టీమిండియా ఆటగాళ్లకు అక్కడి అభిమానులు, సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి ఆటగాళ్లు బస చేసేందుకు ఏర్పాటు చేసిన హోటల్‌కు నేరుగా వెళ్లినట్లు సమాచారం.

ప్రస్తుతం ఈ సిరీస్ 1-1తో సమంగా ఉండటంతో మూడో టెస్టు ఇరు జట్లకు ఎంతో కీలకంగా మారింది. క్రికెట్ కాశీగా పేరుగాంచిన ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఎల్లుండి నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌లో ఆధిక్యం సంపాదించాలని భారత్, ఇంగ్లండ్ జట్లు పట్టుదలగా ఉన్నాయి. కీలక ఆటగాళ్లు ఫామ్‌లో ఉండటంతో ఈ పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -