ఆగస్టులో 15 శాతం తక్కువ
టారిఫ్ ఆందోళనలు, రూపాయి భారం ఎఫెక్ట్
న్యూఢిల్లీ : అమెరికాకు వెళ్లే భారత పర్యాటకుల్లో భారీ తగ్గుదల చోటు చేసుకుంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న టారిఫ్ ఆందోళనకు తోడు అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రి క్తతలు పర్యాటకులపై ప్రభావం చూపాయి. మరోవైపు డాలర్‌తో రూపాయి మారకం విలువ అమాంతం పడిపో వడం అమెరికా పర్యాటకాన్ని భారం చేసింది. ఈ పరిణా మాల నేపథ్యంలో గడిచిన ఆగస్టులో అమెరికాకు భారత పర్యాటకుల సంఖ్య 15శాతం పడిపోయింది. నేషనల్ ట్రావెల్ అండ్ టూరిజం ఆఫీస్ (ఎన్‌టీటీఓ) రిపోర్ట్ ప్రకా రం.. గతేడాది ఇదే నెలతో పోలిస్తే ఆగస్టులో భారతీయ పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గింది. ఇది వరుసగా మూడ వ నెల క్షీణతను సూచిస్తుందని తెలిపింది. జూన్‌లో 8 శాతం, జులైలో 6శాతం తగ్గుదల చోటుచేసుకుంది. అమె రికా, భారతదేశం మధ్య సుంకాలు, రష్యన్ ఆయిల్ కొను గోళ్లు, భారతదేశం-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ వాద నలపై ఉద్రిక్తతలు పెరగడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ క్షీణత వల్ల ఈ వేసవిలో అమెరికన్ వ్యాపారాలకు సుమారు 340 మిలియన్ డాలర్ల పర్యాటక వ్యయ నష్టం జరిగిందని అంచనా.
మరోవైపు డాలర్‌తో రూపాయి మారకం విలువ 88 కనిష్ట స్థాయికి పడిపోవడం పర్యాటకులపై తీవ్ర భారాన్ని మోపుతోంది. 2024 ఇదే జూన్‌లో 35 శాతం, జులైలో 26శాతం, ఆగస్టులో 9 శాతం చొప్పున పెరుగుదల చోటు చేసుకుంది. రెండు దేశాల మధ్య వాణిజ్య , దౌత్యపర మైన ఘర్షణలు, ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారతీయ వస్తువులపై భారీగా సుంకాలు విధిం చడం యూఎస్ పర్యాటకంపై ప్రతికూలదను చూపిందని నిపుణులు భావిస్తున్నారు. 2024లో ప్రతీ భారతీయ సంద ర్శకుడు సగటున ఒక్క యాత్రకు 5,200 డాలర్లు ఖర్చు చేశారు. ఇది ప్రపంచ సగటు 1,802 డాలర్ల కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ. భారత్ నుంచి అంతర్జాతీయ పర్యాటనల్లో కెనడా, మెక్సికో, యునైటెడ్ కింగ్‌డమ్ తర్వాత యూఎస్ నాలుగవ అతిపెద్ద పర్యాటక కేంద్రంగా ఉంది.