చెన్నై : భారత 89వ గ్రాండ్‌మాస్టర్‌గా రోహిత్ కృష్ణ అవతరించాడు. కజకిస్తాన్‌లోని ఆల్మటీ మాస్టర్స్ కోనేవ్ కప్‌లో చివరి రౌండ్‌లో రొమేనియా ప్లేయర్‌ను ఓడించి జిఎం నార్మ్‌ను రోహిత్ సాధించాడు. మంగళవారం రాత్రి జరిగిన చివరి రౌండ్‌లో రొమేనియాకు చెందిన ఐఎం ఆర్తుర్ దుహ్త్యన్‌పై విజయం సాధించి తొమ్మిది పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో నాల్గో జిఎం నార్మ్‌కు కావాల్సిన ఆరు పాయింట్లను సొంతం చేసుకున్నాడు. ఎస్‌ఎస్‌ఎన్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్‌లో మూడో సంవత్సరం చదువుతున్న 19ఏండ్ల రోహిత్.. చిన్నప్పటినుంచే చెస్‌పై ఆసక్తితో పలు పోటీల్లో పాల్గొంటూ వస్తున్నాడు. జిఎం హోదా సాధించిన రోహిత్.. ఆగస్టు 15నుంచి అబుదాబి వేదికగా జరిగే ఇంటర్నేషనల్ టోర్నమెంట్‌లో పాల్గొనే అర్హత సాధించాడు. 2013నుంచి ఒక్కో జిఎం నార్మ్‌ను సాధిస్తున్న రోహిత్.. దాదాపు 12ఏండ్ల తర్వాత నాల్గో జిఎం నార్మ్‌ను సాధించి గ్రాండ్‌మాస్టర్ హోదా పొందాడు. తాను పట్టువదలని విక్రమార్కుడిలా జిఎం హోదా సాధించేందుకు దోహదపడిన కుటుంబ సభ్యులు, స్నేహితులు, మార్గదర్శకులను చిరకాలం గుర్తుంచుకుంటానని ఈ సందర్భంగా వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు.