Thursday, August 14, 2025
EPAPER
spot_img
Homeఆటలు2030 కామన్వెల్త్‌ గేమ్స్‌కు భారత్‌ బిడ్‌

2030 కామన్వెల్త్‌ గేమ్స్‌కు భారత్‌ బిడ్‌

- Advertisement -

ఎస్‌జీఎంలో ఏకగ్రీవ నిర్ణయం
న్యూఢిల్లీ :
2030 కామన్వెల్త్‌ క్రీడల ఆతిథ్యానికి భారత ఒలింపిక్‌ సంఘం(ఐఓఏ) ఆమోదం తెలిపింది. బుధవారం జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశం(ఎస్‌జీఎం)లో ఈమేరకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. కామన్వెల్త్‌ క్రీడల డైరెక్టర్‌ డారెన్‌ హాల్‌ ఇటీవల అహ్మదాబాద్‌ వేదికను పరిశీలించినట్టు గుజరాత్‌ ప్రభుత్వాధికారులతో క్రీడల ఆతిథ్య విషయమై మాట్లాడినట్టు ఎస్‌జీఎంలో ప్రధాన చర్చ జరిగింది. ఈ నెల చివర్లో కామన్వెల్త్‌ క్రీడల ప్రతినిధి బృందం మరోసారి అహ్మదాబాద్‌ను పరిశీలించనున్నట్టు ఎస్‌జీఎం సభ్యులు తెలిపారు. నవంబర్‌ చివరి వారంలో గ్లాస్గోలో జరిగే కామన్వెల్త్‌ క్రీడల జనరల్‌ అసెంబ్లీ అనంతరం ఆ తర్వాత కామన్వెల్‌ క్రీడల ఆతిథ్య దేశాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. ఈ క్రమంలో 2030 కామన్వెల్‌ క్రీడలు నిర్వహించేందుకు బిడ్‌ను భారత్‌ దాఖలు చేయనుంది. వాస్తవానికి 2030 కామన్వెల్త్‌ క్రీడలకు కెనడా బిడ్‌ దాఖలు చేయాల్సి ఉండగా.. ఆ దేశం బిడ్‌ దాఖలు నుంచి వైదొలగడంతో భారత్‌కు అవకాశాలు పెరిగాయి. ఇప్పటికే 2030 కామన్వెల్‌ క్రీడల ఆతిథ్యంపై ఆసక్తిని వ్యక్తం చేసిన భారత్‌.. బిడ్‌ పత్రాలను ఈ నెల 31లోగా అందజేయాల్సి ఉంది. మెగా ఈవెంట్‌కు అయ్యే ఖర్చులన్నింటినీ భారత ప్రభుత్వమే భరిస్తుందని ఐఓఏ స్పష్టం చేసింది. సమావేశం అనంతరం ఐఓసీ సంయుక్త కార్యదర్శి కల్యాణ్‌ చౌబే మాట్లాడుతూ కామన్వెల్త్‌ క్రీడలకు సంబంధించి జనరల్‌ హౌస్‌ ప్రతిపాదనలను ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందని చెప్పారు. గ్లాస్గో కామన్వెల్‌ క్రీడలను నిర్వహించనున్నట్టు ఐఓసీ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సభ్యుడు రోహిత్‌ రాజ్‌పాల్‌ పేర్కొన్నారు. భారత్‌కు కామన్వెల్‌ క్రీడల ఆతిథ్య హక్కులు దక్కితే… షూటింగ్‌, ఆర్చరీ, రెజ్లింగ్‌ తదితర క్రీడలతో పాటు కబడ్డీ, ఖోఖో పోటీలను సైతం ఈ క్రీడల్లో చేర్చే అవకాశముంది. 2010లో ఢిల్లీలో తొలిసారి కామన్వెల్త్‌ క్రీడలను నిర్వహించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad