Thursday, March 19, 2026
E-PAPER
Homeబీజినెస్భారత జీడీపీ అంచనాలకు కోత

భారత జీడీపీ అంచనాలకు కోత

- Advertisement -

డాలర్‌తో రూపాయి 95కు పడొచ్చు
ఆర్‌బీఐ పైన ఒత్తిడే..
ద్రవ్యోల్బణం పెరిగితే కఠిన చర్యలు : గోల్డ్‌మాన్‌ సాక్స్‌ రిపోర్ట్‌
న్యూఢిల్లీ :
పశ్చిమాసియాలో నెలకొన్న సంఘర్షణల వల్ల వచ్చే ఏడాది కాలంలో డాలర్‌తో రూపాయి మారకం విలువ 95 స్థాయికి పడిపోవచ్చని గ్లోబల్‌ బ్రోకరేజ్‌ సంస్థ గోల్డ్‌మాన్‌ సాక్స్‌ తెలిపింది. మరోవైపు భారత వృద్ధి రేటు అంచనాలకు కోత పెట్టింది. ఇరాన్‌పై ఇజ్రాయిల్‌, అమెరికా సంక్షయుక్తంగా కొనసాగిస్తోన్న యుద్ధోన్మాదం వల్ల నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలతో వచ్చే ఆర్థిక సంవత్సరం 2026-27లో భారత జీడీపీ అంచనాలను 7 శాతం నుంచి 6.4 శాతానికి కోత పెడుతూ హెచ్చరించింది. గతంలో కంటే ఇది 50 బేసిస్‌ పాయింట్లు తక్కువ. మరోవైపు ద్రవ్యోల్బణ అంచనాను 30 బేసిస్‌ పాయింట్లు పెంచింది. కరెంట్‌ అకౌంట్‌ లోటు (సీఏడీ) 2025తో పోలిస్తే ఈ ఏడాది 0.8 శాతం పాయింట్లు పెరిగి జిడిపిలో 1.2 శాతానికి చేరుకోవచ్చని అంచనా వేసింది. వచ్చే ఏడాది కాలంలో అమెరికన్‌ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ 95 స్థాయికి పడిపోవచ్చని ఆ సంస్థ చీఫ్‌ ఇండియా ఎకనామిస్ట్‌ శాంతను సేన్‌గుప్తా హెచ్చరించారు. ముఖ్యంగా హార్ముజ్‌ జలసంది మూసివేత వంటి పరిస్థితుల వల్ల చమురు ధరలు బ్యారెల్‌కు 100 మార్కును తాకుతున్నాయన్నారు. ఇది భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడిని పెంచుతుందని ఆయన ఓ ఇంటర్యూలో విశ్లేషించారు.
భిన్నమైన సంక్షోభం..
గత 25 ఏండ్లలో ఎదురైన చమురు సంక్షోభాల కంటే ఇది భిన్నమైనదని శాంతను సేన్‌గుప్తా అభిప్రాయపడ్డారు. గతంలో చమురు ధరలు పెరిగినప్పుడు మధ్యప్రాచ్య దేశాల ఆదాయం పెరిగి.. తద్వారా భారత్‌కు ఎగుమతులు, రెమిటెన్స్‌ల రూపంలో మేలు జరిగేదన్నారు. కానీ.. ప్రస్తుత యుద్ధం నేరుగా ఆ ప్రాంతంలోనే జరుగుతుండటంతో అటు ఇంధన ధరల భారం పెరగడమే కాకుండా ఇటు మధ్యప్రాచ్య దేశాల ఆర్థిక వ్యవస్థలు కూడా దెబ్బతింటాయన్నారు. దీనివల్ల భారత్‌కు అందే ఎగుమతుల ఆర్డర్లు, నిధుల ప్రవాహం కూడా తగ్గిపోవడంతో దేశ ఆర్థిక వ్యవస్థకు రెండు వైపులా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన స్పష్టం చేశారు. కరెంట్‌ అకౌంట్‌ లోటు పెరుగుతున్న నేపథ్యంలో రూపాయి విలువపై ఒత్తిడి కొనసాగుతుందన్నారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం నియంత్రణలోనే ఉన్నప్పటికీ, పెరిగిన చమురు ధరలు, బలహీనపడిన రూపాయి ప్రభావం వినియోగదారుల ధరలపై పడితే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. న

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -