Friday, October 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరాగాంధీ వర్ధంతి.. మద్నూర్‌లో కాంగ్రెస్ నేతల ఘన నివాళులు

ఇందిరాగాంధీ వర్ధంతి.. మద్నూర్‌లో కాంగ్రెస్ నేతల ఘన నివాళులు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
భారత మాజీ ప్రధానమంత్రి, ఐరన్ లేడీ ఇందిరా గాంధీ  వర్ధంతి సందర్భంగా, మద్నూర్ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్మరణ సభ ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొని ఇందిరాగాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రైతు సంక్షేమం, బ్యాంకుల జాతీయీకరణ, హరిత విప్లవం, దేశ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో ఇందిరా గాంధీ  పాత్ర అపూర్వమని గుర్తుచేశారు. దేశం కోసం త్యాగం చేసి, ప్రజలకు అంకితభావంతో పనిచేసిన నాయకురాలిని దేశం ఎప్పటికీ మరవదని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఇందిరమ్మ చూపించిన ప్రజాసేవ మార్గంలో నడుస్తామని ప్రతిజ్ఞ చేశారు.మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దారస్ సాయిలు, రామ్ పటేల్, , రమేష్ సీనుపటేల్, విట్టాల్ గురిజి,కొండ గంగాధర్,రమేష్ వట్నాల వార్ ,ప్రజ్ఞకుమార్,హన్మంత్ యాదవ్,హన్మాండ్లు స్వామి, బండి గోపి,రాములు,ఆముల్, రవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -