నవతెలంగాణ – కుభీర్
మండలంలోని ఆయా గ్రామాల్లో నిర్మిస్తున్న ఇందిరమ్మ గృహాలు త్వరిత గతిన పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ గంగాసాగర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు. గ్రామాల్లో శానిటేషన్, నర్సరీ, ఇందిరమ్మ గృవాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులకు హెచ్చరించారు.
మొదటి విడతలో ఇందిరమ్మ లబ్ధిదారులు మార్కోటింగ్ వేసుకొని పనులు ప్రారంభించుకునేలా చూడాలన్నారు. ముఖ్యంగా రానున్న వేసవికాలంలో ప్రజలకు త్రాగు నీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేస్తూ గ్రామాల అభివృద్ధికి మీ వంతు సహకారం అందించాలని సూచించారు. ఏమాత్రం విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తప్పవని అన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ శ్రీనివాస్, ఏపీవో హరిలాల్, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామీ టెక్నికల్ అసిస్టెంట్లు, తదితరులున్నారు.



