గొంది రాజేష్, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు
నవతెలంగాణ – గోవిందరావుపేట
అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యుడు గొంది రాజేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం సీపీఐ(ఎం) పసర గ్రామ కమిటీ ఆధ్వర్యంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని కోరుతూ ప్రధాన రహదారి నుండి గ్రామపంచాయతీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి పంచాయతీ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని పంచాయతీ కార్యదర్శి పి శరత్ కుమార్ కు అందజేశారు. ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి రాజేష్ మాట్లాడుతూ.. పసర గ్రామంలో 950 మంది ఇందిరమ్మ ఇండ్లకు అర్హులైన వారు ఉన్నారని ఆయన తెలిపారు. కానీ ప్రభుత్వం కేవలం 52 మంది మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుందని విమర్శించారు.
మిగతా 900 మంది పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం గ్రామంలో అర్హులైన వారికి ఇండ్లు రాలేదని ఆయన ఆరోపించారు. ఒక్కొక్కరి దగ్గర నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు డబ్బులు గుంజుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. ఇలాంటి వారిపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూలి నాలు చేసుకుంటూ జీవనం గడిపే వారి దగ్గర నుండి ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని పేరుతో డబ్బులు వసూలు చేయడం సిగ్గుచేటని అన్నారు. గ్రామంలో నిరుపేదలను కాంగ్రెస్ పార్టీ నాయకులు భ్రమల్లో ముంచుతున్నారని విమర్శించారు.
ప్రజలు ఎవరు ప్రలోభాలకు గురికా వద్దని కాంగ్రెస్ నాయకులు పెట్టే భ్రమలకు లోను కావద్దని అన్నారు. ప్రభుత్వ ఖజానా నుండి వచ్చే ప్రతి పైసా ప్రజలదని సంక్షేమ పథకాల రూపంలో అవి ప్రజలకు చేరాలని అన్నారు. అలాంటి సంక్షేమ పథకాలు ప్రజలకు దరికి చేరకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డంకిగా మారారని ఆరోపించారు. ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులు తమ ప్రవర్తన మార్చుకుని గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ప్రజలందరికీ ఇల్లు నిర్మించి ఇవ్వాలనేది కమ్యూనిస్టుల కల అని అన్నారు. ప్రజల కోసం సీపీఐ(ఎం) అనేక పోరాటాలు నిర్వహించిందని ఆయన తెలిపారు. ప్రజలందరికీ ఇల్లు వచ్చేంతవరకు ప్రజల పక్షాన పోరాడుతామని ఆయన అన్నారు.
లేనట్లయితే ఈ ప్రభుత్వానికి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సోమ మల్లారెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తుమ్మల వెంకటరెడ్డి ,పొదిల్లా చిట్టిబాబు, గ్రామ కార్యదర్శి కడారి నాగరాజు. కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు అంబాల మురళి సిఐటియు మండల కార్యదర్శి జిట్టబోయిన రమేష్ గ్రామ కమిటీ సభ్యులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ ,పల్లపు రాజు, మన్సోజు బ్రహ్మచారి,రాజేశ్వరి,సువర్ణ, కవిత, కొమ్ము రాజు, సమ్మక్క, సరళ, రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES