Tuesday, July 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అర్హులైన నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు కట్టివ్వాలి: సీపీఐ(ఎం)

అర్హులైన నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు కట్టివ్వాలి: సీపీఐ(ఎం)

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
భువనగిరి మండలంలోని ముస్త్యలపల్లి గ్రామంలో అసలైన నిరుపేద కుటుంబాలకు ఇంద్రమ్మ ఇల్లు కట్టివ్వాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నరసింహ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం ప్రజావాణిలో  జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి కి  లబ్ధిదారులతో సీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామములో నిరుపేదలకు పూర్తిగా ఇల్లు లేని వారు ఉన్నారని, ఒకే ఇంట్లో రెండు మూడు కుటుంబాలు నివసిస్తున్నారని తెలిపారు.

పెంకల ఇండ్లు ,రేకుల, గుడిసెలు నివసించే కుటుంబాలు అనేకంగా ఉన్నాయని, ఆ కుటుంబాల ఇండ్లు కూలిపోయే ప్రమాదంలో ఉన్నయని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల అప్లికేషన్ చేసుకున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని, అసలైన నిరుపేద లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆ ఆ కుటుంబాలు  ఆందోళన చెందుతున్నారు అని అన్నారు. ఇప్పటికైనా అర్హులైన నిరుపేదలకూ వారి కుటుంబాలను పరిశీలించి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో  మండల కమిటీ సభ్యులు కళ్లెం లక్ష్మీ నరసయ్య, సిలువేరు ఎల్లయ్య ,లబ్ధిదారులు బోదాసు మనెమ్మ ,పల్లపు ఎల్లమ్మ ,బోదాసు తులసి, బోదాసు అంకిత లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -