Thursday, August 28, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో పురోగతి సాధించాలి 

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో పురోగతి సాధించాలి 

- Advertisement -
  • – ఓటరు జాబితాను గ్రామపంచాయతీలో ప్రదర్శించాలి : ఎంపీడీవో రవీందర్ 
  • నవతెలంగాణ-పాలకుర్తి
    ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో పురోగతి సాధించే విధంగా పంచాయతీ కార్యదర్శులు లబ్ధిదారులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక దృష్టిని పెట్టాలని ఎంపీడీవో ఎస్ రవీందర్ సూచించారు. గురువారం మండల కేంద్రంలో గల ఎంపీడీవో కార్యాలయంలో ఓటరు జాబితాను ప్రదర్శించారు. అనంతరం ఏర్పాటుచేసిన పంచాయతీ కార్యదర్శుల సమావేశంలో ఎంపీడీవో రవీందర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. నీటి నిల్వలు లేకుండా నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.
  • ఇంకుడు గుంతల నిర్మాణం పట్ల దృష్టిని పెట్టాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇసుక కొరత లేకుండ చర్యలు చేపట్టాలని సూచించారు. ఓటరు జాబితాను గ్రామపంచాయతీల వద్ద ప్రదర్శించాలన్నారు. ఓటర్ జాబితా పై ఎలాంటి ఫిర్యాదులు వచ్చిన రెండు రోజుల్లో ఎంపీడీవో కార్యాలయానికి సమాచారాన్ని అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాజగోపాల్, గట్టుమల్లు, పంచాయతీ కార్యదర్శిలు యుగేందర్, వెంకటేశ్వర చారి, బి మహేష్, శ్రీకాంత్, శిరీష, చంద్రశేఖర్, శ్రీనివాస్ రెడ్డి, భానుప్రియ, వెంకటేష్, మహేందర్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad