Sunday, May 4, 2025
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇండ్లకు పారదర్శకంగా ఎంపిక చేయాలి..

ఇందిరమ్మ ఇండ్లకు పారదర్శకంగా ఎంపిక చేయాలి..

- Advertisement -

నవతెలంగాణ – మునుగోడు : ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా నిరుపేదలను పారదర్శకంగా ఎంపిక చేయాలని సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు సురిగి చలపతి , సిపిఐ మండల కార్యవర్గ సభ్యులు ఈదుల కంటి కైలాస్ ప్రభుత్వాన్ని కోరారు. శనివారం రాత్రి మండలంలోని చీకటిమామిడి గ్రామంలో మేడే సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసినా అనంతరం జరిగిన సిపిఐ గ్రామ శాఖ మహాసభలో వారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందిరమ్మ పథకంలో ఇల్లు ట్రాక్టర్లు కార్లు కలిగిన వారికి కాకుండా నిరుపేదలని ఎంపిక చేయాలని 600 స్కోర్ ఫీట్స్ నిబంధన తొలగించి బేస్మెంట్లు రేకుల ఇల్లు నిర్మించుకున్న వాళ్లకి పునర్నిర్మానం చేసుకొనుటకు అవకాశం ఇవ్వాలని కోరారు.  నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే కమ్యూనిస్టు పార్టీలో ప్రజలు చేరి పార్టీ నిర్మాణానికి పనిచేయాలని కోరారు . ఈ మహాసభలో సిపిఐ గ్రామ శాఖ కార్యదర్శి ,సహాయ కార్యదర్శి ఏరుకొండ  యాదయ్య , కార్యవర్గ సభ్యులుగా ఏరుకొండ నగేష్ , చింతల రమేష్ ,  రాకేష్ , చింతల వెంకటయ్య , మేడి చంద్రయ్య ,పాలకూరి కాటమయ్య , పుల్కారాం రాములు , టీ సైదులు తదితరులు ఉన్నారు .

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -