- Advertisement -
నవతెలంగాణ – బజార్ హత్నూర్
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అడుగడుగున అడ్డంకాలను, సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ మండల కార్యదర్శి కీర్తి రమణ అన్నారు. భవన నిర్మాణ కార్మికులు, ఇందిరమ్మ లబ్ధిదారులతో కలిసి సోమవారం తహసీల్దార్ శ్యాంసుందర్ కు మెమోరాండం అందజేశారు. మండలంలో ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక కొరత అలాగే పలు సమస్యలతో సతమతమౌతున్నారన్నారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు కంటే మునుపు ట్రాక్టర్ ఇసుక రూ. 5,500 ఉండగా ఇప్పుడు అది 7,500 గా అమ్ముతున్నారన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఇసుక వాహనాలను అధికారులు అనుమతించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పవార్ గంగాధర్, పులి శంకర్, రోహిదాస్, భవనం నిర్మాణ కార్మికులు అలాగే ఆయా గ్రామాల ఇందిరమ్మ లబ్ధిదారులు ఉన్నారు.
- Advertisement -



