నవతెలంగాణ – మద్నూర్
ప్రజా ప్రభుత్వ హాయంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ లబ్ధిదారులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని మద్నూర్ గ్రామ సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తయి నూతన గృహప్రవేశ కార్యక్రమానికి సర్పంచ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతన గృహప్రవేశం లో పాల్గొంటూ మద్నూర్ గ్రామపంచాయతీ పరిధిలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ లబ్ధిదారులకు ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. గ్రామపంచాయతీ పరిధిలో 125 ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనట్లు సర్పంచ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ లబ్ధిదారులకు వెంట వెంటనే బిల్లులు మంజూరు చేయడం ఇండ్ల నిర్మాణదారులు పనులు వేగవంతం చేస్తూ ఒక్కొక్కటిగా పూర్తి కావడం నూతన గృహప్రవేశాలు కొనసాగడం సంతోషకరమని సర్పంచ్ పేర్కొన్నారు. గృహప్రవేశానికి సర్పంచ్ ఉషా సంతోష్ హాజరు కావడం గృహప్రవేశ ఇందిరమ్మ ఇల్లు కుటుంబ లబ్ధిదారులు సంతోషించారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు పూర్తి సహకారం అందిస్తా: సర్పంచ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



