– అశ్వారావుపేట మండలం పురోగతి
– త్వరలో 35 గృహాలను ప్రారంభించనున్న ఎమ్మెల్యే జారె ఆదినారాయణ
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట మండలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు దూసుకుపోతున్నాయి.అధికారుల సమన్వయంతో పనులు వేగంగా సాగుతున్నాయి. గృహ నిర్మాణ శాఖ ఏఈఈ మదన్ కుమార్ తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మొదటి దఫా గా 668,ఐటీడీఏ ప్రత్యేక కోటా 203,పీఎం జన్మన్ కోటా 86 మొత్తం 957 ఇళ్లు మంజూరు చేసారు.
ఇందులో ముగ్గు పోసినవి 915,పునాది వరకు పనులు పూర్తి అయిన 879,గుమ్మాల ఎత్తు వరకు 743,స్లాబ్ వేసినవి 531, గృహనిర్మాణ పనులు పూర్తి అయిన 61 61 ఇళ్ళు ఉన్నాయి.
అశ్వారావుపేట మున్సిపాల్టీ లో..
మొత్తం 136 మంజూరు అవగా,ముగ్గు పోసినవి 130, పునాది వరకు అయినవి 129,గుమ్మాల వరకు వచ్చినవి 119,స్లాబ్ వేసినవి 87, గృహనిర్మాణం పూర్తి అయిన ఇళ్లు 15 సిద్ధంగా ఉన్నాయి. మండల వ్యాప్తంగా ఓకే రోజు మూకుమ్మడిగా గృహ ప్రవేశాలకు 35 గృహాలను సిద్దం చేస్తున్నట్లు ఏఈ తెలిపారు. త్వరలో నాలుగు పంచాయితీల్లో మూకుమ్మడి గృహప్రవేశాలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జారె ఆదినారాయణ హాజరు కానున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న గృహ పథకాల ద్వారా పేదల కలలు నెరవేరుతున్నాయి.



