నవతెలంగాణ – జుక్కల్ : సోపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం గ్రామ కమిటీ శుక్రవారం జీపీ కార్యాలయంలో కార్యదర్శి అశోక్ రాథోడ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సెక్రెటరీ సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అభయా హస్తం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక బాధ్యత తదితర అంశాలను స్థానిక ప్రభుత్వాలైన గ్రామపంచాయతీలు నిర్వహిస్తున్నాయని అన్నారు. గ్రామంలో సొంత స్థలం ఉండి నిరుపేదలను , వికలాంగులు, వితంతువులు , షెడ్యూల్ కులాలు , మైనార్టీ వర్గాలు మరియు వెనుకబడిన తరగతుల అన్ని వర్గాల వారికి ప్రయోజనం కల్పించే విధంగా 15 మంది లబ్ధిదారులను కమిటీ ద్వారా ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. అలా ఎంపికైన 15 మంది లబ్ధిదారులతో శుక్రవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో సమావేశం నిర్వహించడం జరిగిందని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునే లబ్ధిదారుల స్థలాలను గుర్తించి వాటికి మార్కౌట్ చేయడం జరిగింది. ప్రతి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుడు కట్టదలచిన నిర్మాణాలు రెండు బెడ్రూంలు, ఒక హాల్ , ఒక వంటగది , బాత్రూంలో ఉండేటట్టు నిర్మాణాలు చేపట్టాలని ఇదంతా 400 వందల స్క్వేర్ ఫీట్ నుండి 600 వందల స్క్వేర్ ఫీట్ స్థలంలో పైన తెలిపిన నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేపట్టాలని తెలిపారు. అలా కాకుండా ఎక్కువ, తక్కువగా ఉన్న స్థలంలో నిర్మాణం చేస్తే డబ్బులు ఇవ్వడం కుదరదని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సోపూర్ గ్రామ పంచాయితీ కార్యదర్శి అశోక్ రాథోడ్, గ్రామ కమిటీ సభ్యులు , ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరైన లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
సోపూర్ లో ఇందిరమ్మ గ్రామ కమిటీ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES