Tuesday, October 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అనాధ శవాలకు అంత్యక్రియలు చేసిన ఇందూరు యువత

అనాధ శవాలకు అంత్యక్రియలు చేసిన ఇందూరు యువత

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నగరంలోని దేవి దియేటర్ ప్రక్కన గల సార్వజనిక్ స్మశాన వాటికలో గత వారం రోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందిన గుర్తు తెలియని రెండు అనాధ శవాలకి అంత్యక్రియలను నిర్వహించిన ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ 1వ ఠాణా పోలిస్ సిబ్బంది అనుమతితో మంగళవారం ఈ అంత్యక్రియలను సంప్రదాయ పద్ధతిలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబు, కోశాధికారి జయదేవ్ వ్యాస్, దర్శనం రాజు, మద్ది గంగాధర్, రవి,నరేష్ రెడ్డి, 1వ ఠాణా పోలిస్ సిబ్బంది రాజ్ గోపాల్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -