Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeసినిమాఫోక్‌ బీట్‌తో 'ఇందుమామ..'

ఫోక్‌ బీట్‌తో ‘ఇందుమామ..’

- Advertisement -

సెల్విన్‌ దేశారు, ఆహన్‌, బింబిక రావ్‌, ప్రకాష్‌ బేల్వాడి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘దేవసస్య’. ఈ చిత్రాన్ని అనంత ఫిలింస్‌ బ్యానర్‌ పై అనంతమూర్తి హెగడే నిర్మిస్తున్నారు. కార్తీక్‌ భట్‌ దర్శకుడు. త్వరలో ఈ సినిమా గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు రెడీ అవుతోంది. శుక్రవారం ఈ సినిమా నుంచి ‘ఇందుమామ..’ లిరికల్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు.
ఈ పాటకు శ్రీకాంత్‌ లిరిక్స్‌ అందించగా, ధనుంజరు సీపాన పాడారు. హరి అజరు మంచి ఫోక్‌ బీట్‌తో కంపోజ్‌ చేశారు. ట్రైబల్‌ ట్రెడీషన్‌, డ్యాన్సులతో డిజైన్‌ చేసిన ఈ పాట అందర్నీ ఆకట్టుకుంటోంది అని మేకర్స్‌ తెలిపారు.
ఈ చిత్రానికి డీవోపీ – రాజు.ఎన్‌.ఎం, ఎడిటర్‌, కలరిస్ట్‌, వీఎఫ్‌ఎక్స్‌ – ప్రజ్వల్‌. ఆర్‌, మ్యూజిక్‌ – హరి అజరు, ప్రొడక్షన్‌ డిజైనర్‌ – కేజీఎఫ్‌ కిరణ్‌, యాక్షన్‌ – అల్టిమేట్‌ శివ, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ – సంతోష్‌ నాయక్‌ బ్యగడ్డే.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad