కొరియా ఓపెన్ నుంచి నిష్క్రమణ
సియోల్: కొరియా ఓపెన్ సూపర్-500లో భారత షట్లర్లకు నిరాశతప్పలేదు. బుధవారం జరిగిన తొలిరౌండ్ పోటీలో హెచ్‌ఎస్ ప్రణరు గాయపడి టోర్నీనుంచి నిష్క్రమించగా… ఆయష్ శెట్టి, కిరణ్ జార్జి మెయిన్ డ్రా తొలిరౌండ్‌లోనే ఇంటిదారి పట్టారు. బుధవారం జరిగిన తొలిరౌండ్ పోటీలో హెచ్‌ఎస్ ప్రణరు 8-16తో ఇండోనేషియాకు చెందిన ఛికో అరా చేతిలో వెనుకబడి ఉన్న దశలో టోర్నీ నుంచి నిష్క్రమించాడు. అంతకుముందు 5-8పాయింట్లతో ఉన్న దశలోనూ గాయంతో ఇబ్బంది పడ్డ 33ఏళ్ల ప్రణరు చికిత్స తీసుకొని మళ్లీ ఆడినా ప్రయోజనం లేకపోయింది. ఇక ఆయుష్ శెట్టి 18-21, 18-21తో చైనీస్ తైపీకి చెందిన సూ-లీ-యంగ్ చేతిలో పరాజయాన్ని చవిచూశాడు. ఈ మ్యాచ్ కేవలం 47నిమిషాల్లోనే ముగిసింది. ఇక కిరణ్ జార్జి 14-21, 22-20, 14-21తో మాజీ ప్రపంచ ఛాంపియన్ లో-కెన్-యూ(కొరియా) చేతిలో పోరాడి ఓడాడు. ఇక మహిళల సింగిల్స్‌లో 20ఏళ్ల అనుపమ ఉపాధ్యాయ 16-21, 15-21తో 8వ సీడ్ ఇండోనేషియాకు చెందిన వార్ధాని చేతిలో పరాజయాన్ని చవిచూసింది. ఇక మిక్స్‌డ్ డబుల్స్‌లో మోహిత్-లక్షిత జంత 7-21, 14-21తో జపాన్‌కు చెందిన యుచి షింగామి చేతిలో ఓటమిపాలయ్యారు.