కేసీఆర్‌ను కలిసిన హరీశ్‌రావు
రాజకీయ పరిణామాలపై సమాలోచనలు
నవతెలంగాణ-మర్కుక్
ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మంగళవారం సిట్ విచారణకు హాజరైన మాజీ మంత్రి హరీశ్‌రావు.. బుధవారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా సిట్ విచారణలో జరిగిన పరిణామాలు, అధికారుల ప్రశ్నలు.. తాను చెప్పిన సమాధానాలు తదితర అంశాలను కేసీఆర్‌కు హరీశ్‌రావు వివరించినట్టు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసు నేపథ్యంలో జరుగుతున్న విచారణ రాజకీయ ప్రేరేపితంగా సాగుతోందని, ప్రజలను గందరగోళానికి గురి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తెలియజేసినట్టు తెలిసింది. విచారణను ఎదుర్కొవడంలో అను సరించాల్సిన వ్యుహాలపై సమా లోచనలు జరిపారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్ కార్యాచరణ, రాబోయే రాజకీయ సవాళ్లపై కూడా ఇరువురు చర్చించినట్టు సమాచారం. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను సమగ్రంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని ఈ భేటీలో అభిప్రాయం వ్యక్తమైనట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.



