నవతెలంగాణ- ఆత్మకూరు
కామారం భద్రతకు డీసీపీ ఆధ్వర్యంలో గ్రామంలో మూల మధుకర్ రుద్ర కన్సల్టెంట్స్ సహకారంతో 16 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. తన స్వగ్రామాన్ని సురక్షిత ప్రాంతంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో మధుకర్ ఈ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ ఎస్ అంకిత్ కుమార్ కామారం నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మధుకర్ ను సన్మానించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో పరకాల ఏసీపీ సతీష్ బాబు, స్థానిక సీఐ ఆర్. సంతోష్ పాల్గొన్నారు.గ్రామ భద్రత, అభివృద్ధి కోసం ముందడుగు వేసిన మధుకర్‌ను అధికారులు, ప్రజలు ప్రశంసించారు. ఈ ప్రయత్నం గ్రామ ప్రజల్లో భద్రతా అవగాహనను పెంపొందించడంలో కొదవలేని పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు.



