Tuesday, January 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్లక్ష్మీదేవి గూడెంలో వీధిలైట్ల ఏర్పాటు..

లక్ష్మీదేవి గూడెంలో వీధిలైట్ల ఏర్పాటు..

- Advertisement -

నవతెలంగాణ – మునుగోడు
మునుగోడు మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని లక్ష్మీదేవి గూడెంలోని ప్రజలు వీధిలైట్లు లేక ఇబ్బందులకు గురవుతున్నారని సర్పంచి పాలకూరి రమాదేవి నరసింహ దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించి మంగళవారం వీధిలైట్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వీధులలో వీధిలైట్ లేకపోతే చీకటి మయంగా ఉంటే వీధులలో ప్రయాణం చేయాలంటే ప్రజలు ఇబ్బందులు పడతారని అన్నారు. వార్డులలో వార్డు సభ్యులు ఎప్పటికప్పుడు పరిశీలించి తమ దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ కార్యదర్శి వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ ఉప్పునూతల సుగుణమ్మ, వార్డు సభ్యులు సద్దల కళ్యాణి శ్రీశైలం, అనూష జగన్, శ్రీకాంత్, వినయ్, సురేష్, సందీప్ తదితరులున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -