- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2025 నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 మధ్య CBFC ద్వారా సర్టిఫికేషన్ పొందిన చిత్రాలకు ఈ అవార్డులు ప్రదానం చేయనున్నారు. కొత్తగా ‘ఉత్తమ సామాజిక సందేశ చిత్రం’ అవార్డు, ప్రత్యేక విభాగంలో డా.సి.నారాయణరెడ్డి అవార్డులను అందజేయనున్నారు. ఎంట్రీల సమర్పణకు ఫిబ్రవరి 3, 2026 చివరి తేదీగా నిర్ణయించినట్లు మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు.
- Advertisement -



