Tuesday, March 24, 2026
E-PAPER
Homeబీజినెస్కానిస్టేబుల్‌ కుటుంబానికి రూ.1.05 కోట్ల బీమా పరిహారం

కానిస్టేబుల్‌ కుటుంబానికి రూ.1.05 కోట్ల బీమా పరిహారం

- Advertisement -

– అందించిన బీఓబీ అధికారులు
హైదరాబాద్‌ :
తెలంగాణ పోలీసు శాఖ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) మధ్య కుదిరిన ప్రత్యేక శాలరీ ప్యాకేజీ ఒప్పందం కింద ఒక కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి రూపాయలకు పైగా బీమా పరిహారం అందింది. గత ఏడాది రోడ్డు ప్రమాదంలో మరణించిన సిటీ ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌, పెట్లబుర్జు హెడ్‌క్వార్టర్స్‌కు చెందిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ బి రామ నాయుడు మరణానంతరం బిఒబి అధికారులు బీమా క్లెయిమ్‌ ప్రక్రియను వేగవంతం చేసి పూర్తి చేశారు. ఈ క్రమంలో, సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ బి. శివధర్‌ రెడ్డి, మృతుడు రామ నాయుడు సోదరుడు బోయ బీచుపల్లికి రూ.1.05 కోట్ల విలువైన చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐజీ (వెల్ఫేర్‌) డాక్టర్‌ గజరావు భూపాల్‌, బీఓబీ జిఎం రితేష్‌ కుమార్‌, తెలంగాణ సౌత్‌ రీజియన్‌ డీజీఎం రవి హెచ్‌జీ, డిఫెన్స్‌ బ్యాంకింగ్‌ అడ్వైజర్‌ బ్రిగేడియర్‌ సంజరు కుమార్‌ ప్రసాద్‌తో పాటు పలువురు పోలీసు, బ్యాంక్‌ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -