నవతెలంగాణ డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని పీజీ – ఇంటిగ్రేటెడ్ మాస్టర్ అఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఆరవ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలను సోమవారం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం యాదగిరి, కంట్రోలర్ ప్రొఫెసర్ డాక్టర్ కే సంపత్ కుమార్, అడిషనల్ కంట్రోలర్ డాక్టర్ టి సంపత్ కుమార్ తో కలిసి విడుదల చేశారు. 26 మంది విద్యార్థులకు 25 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనరని ఒక విద్యార్థి ఫెయిల్ అయ్యారని కంట్రోలర్ ప్రొఫెసర్ కే. సంపత్ కుమార్ తెలిపారు.పూర్తి వివరాల కొరకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్సైట్ను సంప్రదించాలన్నారు.
పిజి పరీక్షలు పరీక్షలు ప్రశాంతం..
తెలంగాణ యూనివర్సిటీలో ఎనిమిదవ రోజు జరిగిన ఎం.ఏ/ ఎం కాం/ ఎం.ఎస్సీ / ఎంబీఏ/ ఎల్.ఎల్.బి /ఇంటగ్రేటెడ్ పీజీ కోర్సుల రెండవ మరియు నాల్గవ సెమిస్టర్ పరీక్షలకు ఉదయం 1504 మంది విద్యార్థులకు గాను 1438 మంది విద్యార్థులు హాజరైనారు 66 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. సోమవారం మధ్యాహ్నం జరిగిన బి.ఎడ్/ బి.పి ఎడ్ పరీక్షకు 489 మంది విద్యార్థులకుగాను 465 మంది విద్యార్థులు హాజరైనారని 24 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు.
ఇంటిగ్రేటెడ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఆరవ సెమిస్టర్ ఫలితాలు విడుదల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES